- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాష్ట్రంలో గ్యాస్ కొరతపై స్పందించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్లతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. తాజా పరిస్థితులపై వారితో చర్చించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో ప్రజలు భయపడి ముందుగానే ఎక్కవ గ్యాస్ సిలిండర్లు బుకింగ్స్ చేస్తున్నారని దాంతో సాధారణం కంటే రెట్టింపు సిలిండర్లు బుకింగ్ అవుతున్నాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) అన్నారు. రాష్ట్రంలో గృహ అవసరాలకు సంబంధించి గ్యాస్ కొరత లేదని వాణిజ్య సిలిండర్ల కొరత ఉందన్నారు. ఇవాళ ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్లతో సమావేశం అయిన మంత్రి ఉత్తమ్.. రాష్ట్రంలో 810 మంది ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారని ప్రస్తుత పరిస్థితులపై డిస్ట్రిబ్యూటర్లతో చర్చించామన్నారు. జిల్లా స్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీలు ఏర్పాటు చేశామని చెప్పారు. రాష్ట్రంలో 1.3 కోట్ల మంది ఎల్బీజీ వినియోగదారులు ఉన్నారని చెప్పారు. దీపం పథకం కింద 28 లక్షల మంది ఎల్పీజీని వినియోగిస్తున్నారని ప్రతి నెల గృహ వినియోగదారులు 60 లక్షల సిలిండర్లు వాడుతున్నారని చెప్పారు.
రాష్ట్ర, జిల్లా కమిటీలు ఏర్పాటు:
కాగా తాజాగా పరిస్థితులపై నిన్న సెక్రటేరియట్ లో ఉన్నతాధికారులతో మంత్రి ఉత్తమ్ సమీక్ష నిర్వహంచారు. అపోహలు వద్దన బాట్లింగ్ ప్లాంట్లలో కొరత లేదని చెప్పారు. హోటళ్లకు కొంత ఇబ్బంది ఉన్న మాట వాస్తవమేనని అయితే బ్లాక్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ క్రమంలో రాష్ట్రలో ఎల్బీజీ నిల్వలు సరఫరా, రవాణా వ్యవస్థను సమగ్రంగా పర్యవేక్షించేందుకు రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో ఎనర్జీ సప్లై మానిటరింగ్ కమిటీలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. సీఎస్ చైర్ పర్సన్ గా, పౌరసరఫరాల శాఖ కమిషనర్ కన్వీనర్ గా వ్యవహరిస్తారు. జిల్లా స్థాయిలో కలెక్టర్ అధ్యక్షతన కమిటీ పనిచేయనుంది.






