- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Uttam Kumar Reddy: మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిదే కీలక పాత్ర.. ఉత్తమ్ ప్రశంసలు
బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు(Brahmana Vellemla Project) సాధించడంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komati Reddy Venkat Reddy) కీలక పాత్ర పోషించారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) ప్రశంసించారు.

దిశ, వెబ్‌డెస్క్: బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు(Brahmana Vellemla Project) సాధించడంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komati Reddy Venkat Reddy) కీలక పాత్ర పోషించారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) ప్రశంసించారు. శుక్రవారం మంత్రులిద్దరు నల్లగొండ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. అతి త్వరలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని రైతులకు హామీ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) చేతుల మీదుగా రేపు బ్రాహ్మణ వెల్లంల ప్రారంభం ఉంటుందని తెలిపారు.
పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్(BRS) నేతలు ఉమ్మడి నల్లగొండ జిల్లాను, జిల్లాలోని ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే లక్ష ఎకరాలకు సాగునీరు అందుతుందని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఎస్‌ఎల్‌బీసీ కూడా నిర్లక్ష్యానికి గురైందని తెలిపారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లేకపోతే బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు లేదని కీలక ప్రకటన చేశారు. అనంతరం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. ‘నాకు మంచి పేరు రాకూడదని పదేళ్ల పాటు బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టుకు కేసీఆర్(BRS) నిధులు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేశారు. వచ్చే మార్చి లేదా ఏప్రిల్‌లోగా ప్రాజెక్టును పూర్తి చేస్తాం. నా కల నిజం చేసిన సీఎం రేవంత్ రెడ్డి ధన్యవాదాలు’ అని మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.






