ఆ ప్రాజెక్టుపై అధిక మోజుతో పాలమూరుకు అన్యాయం: మంత్రి ఉత్తమ్

by Gantepaka Srikanth |

ప్రాణహిత-చేవెళ్లను తుమ్మడిహట్టి నుంచి మార్చి గోదావరిలో అన్యాయం చేశారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.

ఆ ప్రాజెక్టుపై అధిక మోజుతో పాలమూరుకు అన్యాయం: మంత్రి ఉత్తమ్
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్(BRS) హయాంలో కాళేశ్వరం(Kaleswaram)పై అధిక మోజు చూపి.. పాలమూరు(Palamuru) జిల్లాను అన్యాయం చేశారని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy) మండిపడ్డారు. కావాలనే కుట్రపూరితంగా పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు(Palamuru - Rangareddy Project)ను స్లో డౌన్ చేశారని ఆరోపించారు. జూరాల నుంచి అయితే రోజుకు 2.8 టీఎంసీలు అంటే.. 60 రోజుల్లో 121 టీఎంసీలు తీసుకునే వాళ్లం. సోర్స్‌ను జూరాల నుంచి శ్రీశైలానికి మార్చడం వల్ల 68 టీఎంసీల స్థాయికి పడిపోయింది. ఆయకట్టు కాల్వల ప్రస్తావన, భూసేకరణ లేకుండానే డీపీఆర్ రూపొందించారు.

గోదావరిలోనూ అన్యాయం..

ప్రాణహిత-చేవెళ్లను తుమ్మడిహట్టి నుంచి మార్చి గోదావరిలో అన్యాయం చేశారు. పాలమూరును జూరాల నుంచి శ్రీశైలానికి మార్చి కృష్ణా బేసిన్‌లోనూ అన్యాయం చేశారు. జూరాల నుంచి అయితే 22 పంపులా ఏర్పాటుతో పాలమూరు ప్రాజెక్టు పూర్తయ్యేది. శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి ఏపీ అక్రమంగా నీళ్లు తరలిస్తుంటే కూడా చూస్తూ ఊరుకున్నారు. ఏపీ ప్రభుత్వం రోజుకు 13 టీఎంసీలు తరలించుకుపోయేలా ప్రాజెక్టు నిర్మించుకుంది. జగన్ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మిస్తుంటే.. బీఆర్ఎస్ ప్రభుత్వం కనీసం స్పందించలేదు.. అభ్యంతరం చెప్పలేదు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రాయలసీమ ఎత్తిపోతల పథకంపై కేంద్రానికి ఫిర్యాదు చేశాం.. కేంద్రం సహకారంతో ప్రాజెక్టు పనులు నిలిపివేయగలిగాం. 2024-2025 సీజన్‌లో కృష్ణా జలాల్లో ఎక్కువ నీరు వాడుకున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు కోసం బీఆర్ఎస్ హయాంలో రూ.26,262 కోట్లు ఖర్చు చేశారు. దీంతో 32 శాతం పనులు పూర్తయ్యాయి. ఇంకా 39 వేల ఎకరాల భూమిని సేకరించాల్సిన అవసరం ఉంది. బీఆర్ఎస్ సేకరించిన భూమి కేవలం 175 ఎకరాలు మాత్రమే అని అన్నారు. మొత్తం గోదావరి బేసిన్ ప్రాజెక్టులపై బీఆర్ఎస్ రూ.1,25 కోట్లు ఖర్చు చేసింది. కృష్ణా బేసిన్ ప్రాజెక్టుపై రూ.41 వేల కోట్లు ఖర్చు చేసిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.

Next Story