Uttam: రూ.27 వేల కోట్లు ఇస్తే 90 శాతం పూర్తయినట్టా.. కేసీఆర్‍కు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కౌంటర్

by Prasad Jukanti |   (  Updated:2026-01-01 13:33:41  IST  )

కృష్ణా, గోదావరి జలాలపై ప్రజాభవన్ లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.

Uttam: రూ.27 వేల కోట్లు ఇస్తే 90 శాతం పూర్తయినట్టా.. కేసీఆర్‍కు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కౌంటర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుపై (Palamuru Rangareddy Project) బీఆర్ఎస్‍వి తప్పుడు ప్రచారాలు అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) విమర్శించారు. ఇవాళ ప్రజా భవన్‍లో కృష్ణా, గోదావరి బేసిన్ అంశాలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ (PowerPoint Presentation) ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్, ఎంపీలు, ఎమ్మెల్యేలు తదితరులు హాజరైన ఈ కార్యక్రమంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ఇటీవల కేసీఆర్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులు తాము 90 శాతం పూర్తి చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పూర్తిగా విస్మరించిందని చేసిన ఆరోపణలను ఖండించారు. ఈ విషయంలో కేసీఆర్, హరీశ్ రావు సత్య దూరపు మాటలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి కావడానికి రూ.80 వేల కోట్లు అవసరం అని అలాంటిది ఈ ప్రాజెక్టుపై రూ.27 వేల కోట్లు ఖర్చు చేసినట్లు బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పింది. రూ.80 వేల కోట్ల ప్రాజెక్టుపై రూ. 27 వేల కోట్లు ఖర్చు చేస్తే 90 శాతం పూర్తయినట్టా అని ఉత్తమ్ ప్రశ్నించారు.

మేమొచ్చాక రూ.7 వేల కోట్లు ఖర్చు:

పాలమూరు ప్రాజెక్టు 2015లో జీవో ఇచ్చి డీపీఆర్ మాత్రం ఏడేళ్ల తర్వాత సెప్టెంబర్ 2022లో డీపీఆర్ ను సీడబ్ల్యూసీకి పంపించారన్నారు. ఈ డీపీఆర్‍లో కేవలం రూ. 55 వేల కోట్లు మాత్రమే చూపించారని ఇందులో ఆయకట్టు కోసం భూసేకరణకు అవసరమయ్యే ఖర్చు, పూర్తి పనుల వ్యయం లేదన్నారు. రూ. 27 వేల కోట్లు ఖర్చు చేసినా ఈ ప్రాజెక్టు ద్వారా గత ప్రభుత్వం ఒక్క ఎకరాకు కూడా నీళ్లివ్వలేదని విమర్శించారు. మేము అధికారంలోకి వచ్చాక ఇప్పటికే రూ.7 వేల కోట్లు ఖర్చు చేశామన్నారు.

Next Story