- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Ration Cards: రేషన్ కార్డులపై మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన
రేషన్ కార్డుల(Ration Cards)పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: రేషన్ కార్డుల(Ration Cards)పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో అర్హత ఉన్న అందరికీ రేషన్ కార్డు ఇస్తామని భరోసా ఇచ్చారు. పాత రేషన్ కార్డులు తీసేస్తారని జరుగున్న ప్రచారంలో నిజం లేదని కొట్టిపారేశారు. పాత రేషన్ కార్డులు అలాగే ఉంటాయని అన్నారు. పాత రేషన్ కార్డు(Old ration card)ల్లో కొత్త సభ్యులను చేరుస్తామని చెప్పారు. కులగణన ఆధారంగా రేషన్ కార్డుల ప్రక్రియ ఉంటుందని.. లిస్ట్‌లో పేరు లేకపోతే ఆందోళన చెందొద్దని.. గ్రామ సభల్లో మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేశారు.
మరోవైపు జనవరి 26 నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేయనున్నట్లు ఇప్పటికే మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) సైతం చెప్పారు. పంపిణీ ప్రక్రియ కోసం గ్రామాల్లో సర్వే సైతం జరుగుతుందని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో 2 కోట్ల 81 లక్షల మందికి ఇప్పటికే 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయని పేర్కొన్నారు. అయితే.. ఈ విషయంపై ప్రతిపక్షాలు కావాలనే రాజకీయం చేసి రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. రేషన్ కార్డు అర్హత ఉండి రాకుంటే.. సంబంధిత అధికారికి, ప్రజా ప్రతినిధులకు విజ్ఞాపన పత్రాలు ఇవ్వొచ్చని.. ఇది నిరంతర ప్రక్రియ అని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.






