చెక్‌డ్యాంలు కూలిన ఘటనపై మంత్రి ఉత్తమ్ ఆగ్రహం

by Ramesh Naini |

పెద్దపల్లి జిల్లా గుంపుల, అడవి సోమనపల్లి గ్రామాల్లో ఇటీవల కూలిపోయిన చెక్‌డ్యాంల ఘటనపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

చెక్‌డ్యాంలు కూలిన ఘటనపై మంత్రి ఉత్తమ్ ఆగ్రహం
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: పెద్దపల్లి జిల్లా గుంపుల, అడవి సోమనపల్లి గ్రామాల్లో ఇటీవల కూలిపోయిన చెక్‌డ్యాంల ఘటనపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనను ప్రభుత్వం అత్యంత సీరియస్‌గా తీసుకుందని స్పష్టం చేస్తూ, కూలిపోయిన చెక్‌డ్యాంలపై విజిలెన్స్ విచారణకు ఆదేశాలు జారీ చేశారు. చెక్‌డ్యాంలను నాసిరకంగా, నాణ్యతలేమితో నిర్మించారా? లేక ఎవరైనా కావాలనే ధ్వంసం చేశారా? అనే అంశాలపై సమగ్రంగా విచారణ చేపట్టాలని విజిలెన్స్ విభాగాన్ని మంత్రి ఆదేశించారు. విచారణలో బాధ్యులు ఎవరో తేలితే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

రైతులకు మేలు చేసే చెక్‌డ్యాంలను కావాలనే ధ్వంసం చేసే ప్రయత్నాలను రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం ఊపేక్షించబోదని మంత్రి స్పష్టం చేశారు. విచారణను వేగవంతం చేసి బాధ్యులను త్వరగా గుర్తించాలని ఇప్పటికే విజిలెన్స్ శాఖకు సూచనలు ఇచ్చినట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సాగునీటి వనరుల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, రైతుల ప్రయోజనాలకు భంగం కలిగించే చర్యలపై కఠినంగా వ్యవహరిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు.

Next Story