- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Uttam: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు రండి.. సీఎం స్టాలిన్ కు ఉత్తమ్ ఆహ్వానం
తమిళనాడు సీఎంను మంత్రి ఉత్తమ్ కలిశారు.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‍తో (MK Stalin) భేటీ అయ్యారు. ఈ నెల 8,9 తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించబోతున్న తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమ్మిట్‌కు (Telangana Rising 2047 Global Summit) రావాలని ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఇవాళ చెన్నెలోని సీఎం కార్యాలయంలో స్టాలిన్‍ను కలిసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ మేరకు ఆహ్వానం అందించారు. అయితే తెలంగాణ ప్రభుత్వం గ్లోబల్ సమ్మిట్ పేరుతో ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఈ ఈవెంట్ కు ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీతో పాటు పలువుకు కేంద్ర మంత్రులను స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆహ్వానించారు. ఇక అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను ప్రత్యేకంగా ఆహ్వానించాలని ఈ బాధ్యతను మంత్రులకు అప్పగించారు.






