- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పని చేయాలి : మంత్రి ఉత్తమ్ సూచన
ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా ఇంజినీర్లు క్షేత్ర స్థాయిలో పనిచేయాలని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు.

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా ఇంజినీర్లు క్షేత్ర స్థాయిలో పనిచేయాలని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. మంగళవారం కుందన్‌భాగ్‌లో హైదరాబాద్ ఇంజినీర్స్ అసోసియేషన్ డైరీని మంత్రి ఆవిష్కరించారు. 343 ఇంజినీర్లకు మొదటిసారిగా నిస్పక్షపాతంగా, పారదర్శకతతో సీనియార్టీ ప్రకారం డిప్యూటీ ఈఈ నుంచి ఈఎన్సీ వరకు పదోన్నతులు కల్పించినందుకు అసోసియేషన్ తరఫున సీఎం రేవంత్‌రెడ్డికి, మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర పురోభివృద్దికి తమ వంతు కృషి చేయాలని అన్నారు. శక్తి వంచన లేకుండా చివరి ఆయకట్టు వరకు సాగు నీరు అందేలా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ రాపోలు రవీందర్, జనరల్ సెక్రెటరీ చక్రధర్, ఈఎన్సీ అడ్మిన్ రమేశ్‌బాబు, జాయింట్ సెక్రెటరీ కె.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.






