Minister Uttam: రేషన్ కార్డు ఉన్న వారికి శుభవార్త.. మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన

by Kema Shiva Kumar |

రేషన్ కార్డు (Ration Card) ఉన్న వారికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) కీలక ప్రకటన చేశారు.

Minister Uttam: రేషన్ కార్డు ఉన్న వారికి శుభవార్త.. మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: రేషన్ కార్డు (Ration Card) ఉన్న వారికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) కీలక ప్రకటన చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రేషన్ కార్డులో పేరు ఉన్న ప్రతి ఒక్కరికీ 6 కేజీల చొప్పున సన్న బియ్యం పంపిణీ చేయబోతున్నట్లుగా ప్రకటించారు. సన్న బియ్యం పంపిణీతో ప్రభుత్వంపై సుమారుగా ప్రతి ఏటా రూ.12 వేల కోట్ల భారం పడబోతోందని తెలిపారు. ఉగాది పండుగ (Ugadi Festival) నుంచి అన్ని రేషన్ షాపుల్లో విధిగా సన్న బియ్యం పంపిణీ చేయబోతున్నామని అన్నారు. అదేవిధంగా ఇటీవల చేపట్టిన కులగణన సర్వే (Cast Census Survey) ఆధారంగా కొత్త రేషన్ కార్డు (New Ration Cards)ను ఈనెల 26 నుంచి జారీ చేయబోతున్నామని ప్రకటించారు.

అదేవిధంగా కొత్త రేషన్ షాపుల (New Ration Cards)పై కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. తాము కొత్త షాపులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా.. ప్రస్తుతం రేషన్ షాపులు (Ration Shops) నడుపుతున్న వారిపై భారం పడుతుందని అన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ (BRS Government) హయాంలో కొత్తగా 4 వేలకు తండాలను గ్రామ పంచాయతీలుగా చేశారని.. అక్కడ అవసరం ఉన్న చోట కొత్త రేషన్ షాపు (New Ration Shops)లను ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నామని స్పష్టం చేశారు.

Next Story