- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Uttam Kumar Reddy: మ్యారేజ్ డే సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమోషనల్ పోస్టు
మ్యారేజ్ డే సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమోషనల్ పోస్టు

దిశ, డైనమిక్ బ్యూరో: గత 3 దశాబ్దాలుగా వారి గుండెల్లో తమకు ప్రత్యేక స్థానం కల్పించిన కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల ప్రజల పట్ల ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటామని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి (Uttam Kumar Reddy), ఎమ్మెల్యే పద్మావతి (Padmavathi) దంపతులు అన్నారు. ఈ రెండు నియోజకవర్గాల అభివృద్ధికి, ఇక్కడి ప్రజల జీవితాలను మెరుగుపరచడానికి తాము జీవితాలను అంకితం చేస్తున్నామన్నారు. ఇవాళ తాను తన సతీమణి పద్మావతితో కలిసి 35వ వివాహ వార్షికోత్సావాన్ని హైదరాబాద్‌లో జరుపుకున్నట్లు ఉత్తమ్ తెలిపారు. ఈ సందర్భంగా తమకు శుభాకాంక్షలు తెలిపిన వారికి కృతజ్ఞతలు చెప్పారు. అదేవిధంగా కోదాడ (Kodada), హుజూర్ నగర్ (Huzur Nagar) ప్రజలను ఉద్దేశించి ఉత్తమ్ ఎమోషనల్ కామెంట్స్ (Uttam Kumar Reddy emotional) చేశారు. ఈ నియోజకవర్గాల్లోని తమ ప్రత్యేక కుటుంబ సభ్యులు, అన్నదమ్ములు, అక్కాచెల్లెల్లతో పాటు ప్రతి వ్యక్తి జీవితాలను మెరుగుపరచడానికి అవిశ్రాంతంగా కృషి చేయడానికి నిబద్ధతతో, చిత్తశుద్ధితో ఉన్నామని ప్రకటించారు. కాగా ఉత్తమ్, పద్మావతి దంపతులకు పిల్లలు లేరు. అయితే కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గ ప్రజలను తమ సొంత పిల్లలుగా భావిస్తామని ఈ దంపతులు గతంలో అనేక సార్లు భావోద్వేగంతో ప్రకటించిన సంగతి తెలిసిందే.






