- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యూరియాను త్వరగా తెప్పించండి : కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి మంత్రి తుమ్మల లేఖ
రాష్ట్రానికి నెలవారి కేటాయించిన ఎరువుల కంటే కేంద్రం తక్కువగా పంపిణీ చేసిందని, ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయే నెలల్లో రైతులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని, వెంటనే యూరియాను తెప్పించేలా చొరవ చూపాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ రాశారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రానికి నెలవారి కేటాయించిన ఎరువుల కంటే కేంద్రం తక్కువగా పంపిణీ చేసిందని, ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయే నెలల్లో రైతులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని, వెంటనే యూరియాను తెప్పించేలా చొరవ చూపాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ రాశారు. రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఒక నెలకు ముందుగానే సరిపడా యూరియా నిల్వలను రాష్ట్రంలో అందుబాటులో ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నదని తెలిపారు. అయినప్పటికీ ఈ విషయంలో కేంద్రం నుండి సహకారం లభించడం లేదని పేర్కొన్నారు. ఇప్పటికే కేంద్ర రసాయన, ఫెర్టిలైజర్ మినిస్టర్ జేపీ నడ్డాకు చాలా వరకు లేఖలు రాసినట్లు తెలిపారు.
జూన్ నెలకు సంబంధించి రాష్ట్రానికి 1.71 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను కేటాయించగా, కేవలం 67 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. ఏప్రిల్, మే నెలలకు సంబంధించి కేటాయించిన దాని కంటే 1.21 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను కేంద్రం తక్కువగా సప్లై చేసిందని.. మొత్తంగా 3 నెలలకు గాను 2.25 లక్షల మెట్రిక్ టన్నులు కేంద్రం నుండి రావాల్సి ఉందని మంత్రి పేర్కొన్నారు.






