- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Tummala: రాష్ట్రంలో డ్రగ్, గన్ కల్చర్ కు మూలం కేటీఆరే: తుమ్మల
కేటీఆర్ విమర్శలకు మంత్రి తుమ్మల కౌంటర్ ఇచ్చారు.

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో డ్రగ్, గన్ కల్చర్‍కు మూలం కేటీఆరే (KTR) అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageswara Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ హయాంలో ఓట్ల కోసం ఇచ్చిన వాగ్ధానాలు, మీరు పెట్టిన లక్షలాది కోట్ల బాకీల సంగతి ఏంటని ప్రశ్నించారు. ఇవాళ జూబ్లీహిల్స్ సెగ్మెంట్‍లో (Jubilee Hills campaign) క్యాంపెయిన్ నిర్వహించిన తుమ్మల ఈ సందర్భంగా ఓ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ బాకీ కార్డు అంటూ కేటీఆర్ చేస్తున్న ప్రచారానికి ఈ సందర్భంగా తుమ్మల కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ వారిచ్చిన వాగ్ధానాలు అసలు నెరవేర్చలేదని దుయ్యబట్టారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత ఇబ్బంది కరంగా ఉన్నా గడిచిన 20 నెలలుగా రేవంత్ రెడ్డి సంక్షేమం, అభివృద్ధిని కొనసాగిస్తున్నారని చెప్పారు. బీఆర్ఎస్ నేతలు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు గుర్తుపెట్టుకోవాలన్నారు. పదేళ్ల పాలన చూసిన ప్రజలు గత అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్‍కు బుద్ధి చెప్పారని అలాంటి వారికి కాంగ్రెస్ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. రేవంత్ రెడ్డి పెట్టే ఇబ్బందుల కారణంగానే పారిశ్రామిక వేత్తలు ఇతర ప్రాంతాలకు తరలివెళ్లిపోతున్నారని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను తుమ్మల ఖండించారు. పారిశ్రామిక వేత్తలు రోజుకొకరు పెట్టుబడుల కోసం ఇక్కడికి వస్తున్నారని చెప్పారు.






