- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యూరియా యాప్‌పై బీఆర్ఎస్ బూటకపు ప్రచారం : మంత్రి తుమ్మల కీలక వ్యాఖ్యలు
రాష్ట్రంలో యూరియా కోసం రైతులు క్యూ లైన్ లో ఉన్నారని ప్రతి పక్ష బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారం అబద్దమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కొట్టి పారేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో యూరియా కోసం రైతులు క్యూ లైన్ లో ఉన్నారని ప్రతి పక్ష బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారం అబద్దమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కొట్టి పారేశారు. రైతులకు గత పదేళ్ళలో వారి ప్రభుత్వం ఏ విధంగా రైతులను గోస పెట్టిందో రైతాంగానికి తెలుసనే సంగతి మరిచి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంటూ, తాము అధికారం చేపట్టిన ఈ రెండు సంవత్సరాలలో వ్యవసాయ రంగానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిపారు. సిద్దిపేట, గజ్వేల్ లో ఎరువుల కోసం క్యూ లైన్ లతో పాటు రైతులు మరణించిన సందర్భాలు మరిచిపోయి రాష్ట్రంలో ఒకటి రెండు చోట్ల సాంకేతిక సమస్యలతో ఏర్పడిన రద్దీని కూడా రాజకీయంగా వాడుకొనే పరిస్థితికి ఆ పార్టీ దిగజారిందన్నారు. రైతులు కొనుగోలు చేయకుండానే 7.60 లక్షల టన్నులు యూరియా ఈ యాసంగిలో ఏవిధంగా అమ్మకం జరిగిందో తెలుసుకోవాలని, వరి బోనస్ గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ నాయకులకు లేదన్నారు. గత వానాకాలం కేంద్ర నుండి తగిన సమయంలో ఎరువులు అందక కొన్ని రోజులు పడిన ఇబ్బందులును రాజకీయ లబ్ధి కోసం ప్రతిపక్షం వాడుకుంటే పంచాయతీ ఎన్నికల్లో రైతులు కర్రు కాల్చి వాత పెట్టారన్నారు.
8.42 లక్షల మెట్రిక్ టన్నులు సరాఫరా..
యూరియా యాసంగికి 10.40 లక్షల మెట్రిక్ టన్నులు అవసరముంటే ఇప్పటికే 8.42 లక్షల మెట్రిక్ టన్నులు సరాఫరా జరిగిందని, 7.60 లక్షల మెట్రిక్ టన్నులు రైతులకు పంపిణీ చేసినట్లు వెల్లడించారు. ఈ వానాకాలం పత్తి రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కిసాన్ యాప్ ను విజయవంతం కావడంతో, అదే ప్రాతిపదికన యూరియా యాప్ ను తీసుకువచ్చి పరిశీలిస్తుంటే బీఆర్ఎస్ నాయకులకు వచ్చిన ఇబ్బంది ఏంటో చెప్పాలన్నారు. యాప్ అమలులో ఉన్న జిల్లాల రైతులను అడిగి తెలుకుంటే బాగుంటుందన్నారు. మిగతా అన్ని జిల్లాల్లో రైతులకు అవసరం మేరకు యూరియా బస్తాలు సరఫరా చేస్తూ ఉంటే, తిరిగి రైతులలో ఆందోళన సృష్టించడానికి రోజుకొకరు యూరియా అని, యాప్ అని, మాట్లాడుతుంటే రైతులు నవ్వుకుంటున్నాన్నారు.. యాప్ ద్వారా 22 జిల్లాల రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇప్పటికే 2.64 కోట్ల బస్తాల యూరియాను కొనుగోలు చేశారు.. గత ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన వారు కూడా రైతుల సౌకర్యార్థం ఒక యాప్ తీసుకొస్తే ఊరూరా తిరిగి లేని పోని అపోహాలు సృష్టించినా రైతులు వారిని నమ్మ లేదన్నారు. ప్రాసలతో కల్లబొల్లి మాటలు చెప్పినా రైతులు నమ్మరనే విషయాన్ని బీఆర్ఎస్ నాయకులు ఇప్పటికీ గ్రహించినట్లు లేదన్నారు. ఈ ప్రభుత్వం మీద రైతులకు పూర్తి నమ్మకముందని రైతు భరోసా , రైతు బీమా , పంట కొనుగోళ్లు, బోనస్, పంట నష్ట పరిహారం, యాంత్రీకరణ పథకాలతో మా చిత్తశుద్ధి నిరూపించుకున్నామన్నారు.






