పార్లమెంట్‌లో అబద్ధాలు చెప్పడం కరెక్ట్ కాదు.. కేంద్రమంత్రి అనుప్రియకు మంత్రి తుమ్మల లేఖ

by Gantepaka Srikanth |

కేంద్రమంత్రి అనుప్రియ పటేల్‌(Union Minister Anupriya)కు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు లేఖ(Tummala Nageswara Rao) రాశారు.

పార్లమెంట్‌లో అబద్ధాలు చెప్పడం కరెక్ట్ కాదు.. కేంద్రమంత్రి అనుప్రియకు మంత్రి తుమ్మల లేఖ
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రమంత్రి అనుప్రియ పటేల్‌(Union Minister Anupriya)కు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు లేఖ(Tummala Nageswara Rao) రాశారు. పార్లమెంట్‌ సాక్షిగా తప్పుడు లెక్కలు చెప్పడం శోచనీయం అని అన్నారు. కేటాయింపుల ప్రకారం యూరియా సరఫరా చేయకపోవడంతో ఇప్పటికే 2.24 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా లోటు ఏర్పడిందని అన్నారు. పార్లమెంట్ సాక్షిగా స్వయంగా కేంద్రమంత్రి తప్పుడు లెక్కలు చెప్పడం కరెక్ట్ కాదని.. దీని మూలంగా రైతులు అయోమయానికి గురయ్యే అవకాశం ఉందని చెప్పారు. జులై నెల వరకు సరఫరా కాని యూరియాతో పాటు ఆగష్టు నెలకు కేటాయించిన సరఫరాను కూడా త్వరగా అందించాలని లేఖలో మంత్రి తుమ్మల నాగేశ్వర రావు విజ్ఙప్తి చేశారు.

కాగా, ఇటీవలే కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, పీయూష్ గోయల్‌లతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యి.. తెలంగాణకు కేటాయించిన ఎరువులు సకాలంలో సరఫరా చేయాలని కోరారు. వానాకాలం పంటకు సంబంధించి ఇప్పటికే రావాల్సిన యూరియా అందని విషయాన్ని కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వానాకాలం సాగు దృష్టిలో పెట్టుకొని తెలంగాణకు కేటాయించిన యూరియా సరఫరా వేగవంతం చేయాలని కోరారు. అంతేకాదు.. తెలంగాణకు యూరియా కోటా పెంచాలంటూ సీఎం డిమాండ్ చేశారు.

Next Story