Local Elections: కాంగ్రెస్ శ్రేణులకు మంత్రి తుమ్మల కీలక పిలుపు

by Gantepaka Srikanth |
Local Elections: కాంగ్రెస్ శ్రేణులకు మంత్రి తుమ్మల కీలక పిలుపు
X

దిశ, వెబ్‌డెస్క్: స్థానిక సంస్థల ఎన్నికల(Local Elections) వేళ కాంగ్రెస్(Telangana Congress) శ్రేణులకు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు(Minister Tummala Nageswara Rao) కీలక పిలుపునిచ్చారు. ఆదివారం ఖమ్మం జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటాలని సూచించారు. పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలకు తప్పకుండా ఎన్నికల్లో ప్రాధాన్యత ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రజామోదం ఉన్న నేతలనే ఈ ఎన్నికల్లో ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. పార్టీలో క్రమశిక్షణ తప్పినవారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని హెచ్చరించారు. తప్పకుండా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగిరి తీరాలని అన్నారు. అన్ని స్థానాల్లో మన అభ్యర్థులు గెలవాలని తెలిపారు.

మరోవైపు.. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు కోసం పార్టీ బలోపేతానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల సూచించారు. ముఖ్యంగా ఇందుకోసం ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో పనిచేయాలని ఆదేశించారు. గ్రామాల్లో కాంగ్రెస్ బలాన్ని పెంపొందించేందుకు కృషి చేయాలని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో అధిక సంఖ్యలో ఏకగ్రీవాలు సాధించే బాధ్యత ఎమ్మెల్యేలదేనని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు నిదర్శనంగా అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని సూచించారు.

Next Story

Most Viewed