చేతి వృత్తులకు ఇండియా క్రాఫ్ట్ మేళా అండగా నిలవాలి : మంత్రి తుమ్మల

by Ramesh Naini |

చేతి వృత్తులకు ఇండియా క్రాఫ్ట్ మేళా అండగా నిలవాలి : మంత్రి తుమ్మల
X

దిశ, తెలంగాణ బ్యూరో : భారతీయ కళా నైపుణ్యం గల చేతి వృత్తులు అంతరించకుండా ఇండియా క్రాఫ్ట్ మేళా అండగా నిలవాలని రాష్ట్ర వ్యవసాయ, చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆశాభావం వ్యక్తం చేశారు. ఆదివారం శిల్పారామం ప్రాంగణంలో ఆల్ ఇండియా క్రాఫ్ట్ మేళా ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ఈ మేళాలో దేశవ్యాప్తంగా హ్యాండ్లూమ్ అవార్డు గ్రహీతలు, హ్యాండ్లూమ్ కంపెనీలకు, సహకార సంఘాలకు సంబంధించిన 100 కి పైగా స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మేళా 05 జనవరి 2026 వరకు కొనసాగుతోందన్నారు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా క్రాఫ్ట్ మేళాకు శిల్పారామం వేదికైందని ప్రజలు క్రాఫ్ట్ మేళా సందర్శించి చేతి వృత్తుల వారిని ప్రోత్సహించాలని కోరారు.

Next Story