పత్తి కొనుగోళ్ల ప్రారంభంపై మంత్రి తుమ్మల క్లారిటీ

by Gantepaka Srikanth |

రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల అధికారులుతో మంత్రి తుమ్మల నాగేశ్వర రావు(Minister Tummala Nageswara Rao) ఆదివారం పత్తి సేకరణపై సమీక్షా సమావేశం నిర్వహించారు.

పత్తి కొనుగోళ్ల ప్రారంభంపై మంత్రి తుమ్మల క్లారిటీ
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల అధికారులుతో మంత్రి తుమ్మల నాగేశ్వర రావు(Minister Tummala Nageswara Rao) ఆదివారం పత్తి సేకరణపై సమీక్షా సమావేశం నిర్వహించారు. CCI ఆహ్వానించిన టెండర్లును ఈనెల 10వ తేదీన ఓపెన్ చేసినట్లు, వాటిలో మొత్తం 328 జిన్నింగ్ మిల్లులు పాల్గొన్నాయని, టెక్నికల్ టెండర్లు నిన్నటికి పూర్తయ్యాయని మార్కెటింగ్ శాఖల అధికారులు మంత్రికి తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ, టెండర్ల ప్రక్రియ పూర్తవ్వగానే సంబంధిత జిన్నింగ్ మిల్లుల జాబితాను జిల్లా కలెక్టర్లకు తెలియజేయాలని, తరువాత ఆయా మిల్లులను పత్తి కొనుగోలు కేంద్రాలుగా నోటిఫై చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. పత్తి కొనుగోలు కార్యకలాపాల కోసం సీసీఐ ప్రవేశపెట్టిన “Kapas Kisan” యాప్ ద్వారా రైతులు నమోదు చేసుకోవాల్సి ఉంటుందని అధికారులు వివరించగా, రైతులు నమోదు సమయంలో ఎటువంటి సాంకేతిక ఇబ్బందులు ఎదుర్కోకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని మంత్రివర్యులు సూచించారు.

కొంతమంది రైతులు మొబైల్ నంబర్లు మార్చిన కారణంగా యాప్‌లో లాగిన్ కావడంలో సమస్యలు ఎదుర్కొనే అవకాశముందని మంత్రివర్యులు పేర్కొనగా.. దానికి డైరెక్టర్ వ్యవసాయ శాఖ సమాధానం ఇస్తూ ఆధార్ నంబర్ + OTP ద్వారా లాగిన్ చేసే అవకాశం కల్పించాలని, అలాగే డేటాబేస్‌లో లేని రైతులకు కొత్త రిజిస్ట్రేషన్ సదుపాయం ఇవ్వాలని సీసీఐ అధికారులను కోరినట్లు మంత్రికి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయశాఖ అధికారులకు Kapas Kisan యాప్‌లో స్లాట్ బుకింగ్, కౌలు రైతుల నమోదు ప్రక్రియపై శిక్షణా కార్యక్రమాలు సెప్టెంబర్ 29 నుండి అక్టోబర్ 8 వరకు నిర్వహించినట్టు అధికారులు తెలిపారు. అలాగే రైతుల సమస్యల పరిష్కారం కోసం టోల్-ఫ్రీ నంబర్ 1800 599 5779 ఏర్పాటు చేసి, ఉదయం 7.00 గంటల నుండి రాత్రి 9.00 గంటల వరకు రైతుల ఫిర్యాదులు స్వీకరిస్తున్నట్టు వివరించారు.

మంత్రి మాట్లాడుతూ, Kapas Kisan యాప్ ద్వారా రైతుల నమోదు ప్రక్రియ మొదటిసారిగా చేపడుతున్నందున, రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రతి కొనుగోలు కేంద్రంలో ఒక డాటా ఎంట్రీ ఆపరేటర్‌ను నియమించి, రైతులకు యాప్ ద్వారా నమోదు చేసే విధానంపై అవగాహన కల్పించాలని ఆదేశించారు.

Next Story