Breaking: తెలంగాణ రైతాంగానికి భారీ ఊరట.. యూరియాపై మంత్రి తుమ్మల మరో కీలక ప్రకటన

by Ramesh Naini |

తెలంగాణలో రైతాంగానికి భారీ ఊరట లభించబోతుంది.

Breaking: తెలంగాణ రైతాంగానికి భారీ ఊరట.. యూరియాపై మంత్రి తుమ్మల మరో కీలక ప్రకటన
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: తెలంగాణలో (urea) యూరియా కోసం ఎదురుచూస్తున్న (Farmers) రైతాంగానికి భారీ ఊరట లభించబోతుంది. ఈ మేరకు యూరియాపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Tummala Nageswara Rao) శుక్రవారం మరో కీలక ప్రకటన విడుదల చేశారు. యూరియా సరఫరాలో రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలు ఫలిస్తున్నాయని మంత్రి తుమ్మల తెలిపారు. వచ్చే రెండు రోజుల్లో గద్వాల్, పెద్దపల్లి, జగిత్యాల, వరంగల్, సనత్ నగర్, జడ్చర్ల, కరీంనగర్, పందిళ్లపల్లి, గజ్వెల్, మిర్యాలగూడ, నాగిరెడ్డిపల్లికి 21,325 మెట్రిక్ టన్నుల యూరియా చేరుకోనున్నదని తెలిపారు. సెప్టెంబర్ మొదటి వారంలోగా గంగవరం, దామ్ర, కరాయికల్ పోర్టుల నుంచి మరో 29,700 మెట్రిక్ టన్నుల యూరియా రానుందని ఆయన క్లారిటీ ఇచ్చారు. పోర్టుల నుంచి ఆదిలాబాద్, జడ్చర్ల, గద్వాల్, వరంగల్, మిర్యాలగూడ, పందిళ్లపల్లి, సనత్ నగర్, గజ్వేల్ ప్రాంతాలకు యూరియా చేరుకోనుందని వెల్లడించారు. అక్కడి నుంచి డిమాండ్ పరంగా జిల్లాలకు పంపిణీ చేయనున్నారు. సాయంత్రంలోగా పంట నష్టంపై సమగ్ర నివేదిక అందించాలని అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశాలు ఇచ్చారు. బృందాలుగా ఏర్పడి జిల్లాలలో పర్యటించి, పంట నష్టం వివరాలను సేకరించాలని అధికారులకు సూచించారు. ఈ మేరకు వరద ప్రభావిత జిల్లా కలెక్టర్లతో పరిస్థితులపై మంత్రి తుమ్మల మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.

Next Story