- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రైతులకు మంచి రోజులు వచ్చాయి.. మంత్రి తుమ్మల హర్షం
రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు చేసే రైతులకు మంచిరోజులు వచ్చాయని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు హర్షం వ్యక్తం చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు చేసే రైతులకు మంచిరోజులు వచ్చాయని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు హర్షం వ్యక్తం చేశారు. టన్ను ఆయిల్ పామ్ గెలల ధర రూ. 21 వేలకు చేరిందని, తాము అధికారం చేపట్టిన తరువాత రూ. 8,500 పెరిగిందని తెలిపారు. దీని ద్వారా 64,582 మంది ఆయిల్ పామ్ రైతులకు అదనపు లబ్ధి చేకూరనుందని వెల్లడించారు. మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంటూ రేవంత్సర్కార్వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తూ రైతు భరోసా, రుణమాఫీ పథకాలను రైతులకు అందిచడం ద్వారా వ్యవసాయ రంగం లాభదాయకంగా మారిందన్నారు. రాష్ట్రంలో పంట మార్పిడి ఆవశ్యకత, వంటనూనెల డిమాండును దృష్టిలో ఉంచుకొని ఆయిల్ పామ్ సాగును పెద్ద ఎత్తున చేపట్టడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు.
రాష్ట్రంలోని 31 జిల్లాల్లో ఆయిల్ పామ్ సాగు విస్తరణ చేపట్టేందుకు 14 కంపెనీలకు అనుమతులివ్వడం జరిగిందని, ఇప్పటివరకు సుమారు 2.43 లక్షల ఎకరాలను ఆయిల్ పామ్ సాగులోకి తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. ఆయిల్ పామ్ తోటల యాజమాన్యం అంతర పంటల సాగు కోసం 45,548 మంది రైతుల ఖాతాలలోకి రు.72 కోట్లను మా ప్రభుత్వం జమ చేసిందన్నారు. రైతులకు అధిక ధరలను అందించి, ఆయిల్ పామ్ సాగును లాభసాటిగా చేసి కొత్త రైతులను ప్రోత్సహించడానికి అన్ని చర్యలు తీసుకుంటామన్నారు.
ముడి పామ్ ఆయిల్ పై దిగుమతి సుంకాన్ని తిరిగి విధించి దేశీయ పామ్ ఆయిల్ రైతులను ప్రోత్సహించుటకు చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం ద్వారా ముడి పామ్ ఆయిల్ దిగుమతిపై సుంకాన్ని 27.5 శాతానికి పెంచిందన్నారు. మా ప్రభుత్వం వచ్చిన ప్రారంభంలో టన్ను ఆయిల్ పామ్ గెలల ధర రూ.14,174 ఉండగా, ఈ నెల టన్ను ఆయిల్ పామ్ గెలల ధర రూ.21 వేలకు పెరిగిందని అన్నారు. పెరుగుతున్న ధరలను దృష్టిలో ఉంచుకొని పెద్ద మొత్తంలో రైతులు ముందుకు వచ్చి ఆయిల్ పామ్ సాగు చేపట్టాలని కోరారు.






