వర్క్‌ టూ ఓనర్‌ పథకం కొనసాగిస్తాం.. కేంద్ర పథకాలకు సీఎం ఫోటో పెట్టాలి: మంత్రి తుమ్మల ఫైర్

by Ramesh Naini |

కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే వర్క్ టూ ఓనర్ పథకాన్ని అందుబాటులోకి తీసుకురావాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.

వర్క్‌ టూ ఓనర్‌ పథకం కొనసాగిస్తాం.. కేంద్ర పథకాలకు సీఎం ఫోటో పెట్టాలి: మంత్రి తుమ్మల ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: గత ప్రభుత్వ హయాంలో వర్క్ టు ఓనర్ పథకం (Work to Owner scheme) కోసం రూ.380 కోట్లు కేటాయించి ఉన్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే వర్క్ టూ ఓనర్ పథకాన్ని అందుబాటులోకి తీసుకురావాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Tummala Nageswara Rao) స్పందించారు. వర్క్‌ టూ ఓనర్‌ పథకం కొనసాగిస్తామని ఆయన హామి ఇచ్చారు. అదేవిధంగా రేషన్ దుకాణాల్లో ప్రధాని ఫోటో పెట్టాలని వివాదం నడుస్తోన్న విషయం తెలిసిందే. దీనిపై మంత్రి తుమ్మల స్పందిస్తూ.. ఇది నీ అబ్బ సొత్తు కాదు.. మా అబ్బ సొత్తు కాదు.. కేంద్రానికి 70 పైసలు ఇస్తే.. 30 పైసలు ఇస్తున్నారు.. కేంద్రాన్ని కాపాడేది రాష్ట్ర ప్రభుత్వాలని అని ఫైర్ అయ్యారు. కేంద్రం నిధులిస్తుందట.. ఎవరిదో ఫోటో పెట్టాలంటా.. మేము కూడా పన్నులు కడుతున్నాము.. కేంద్ర పథకాలకు మా సీఎం ఫొటో పెట్టాలని మంత్రి తుమ్మల డిమాండ్ చేశారు.

కాగా, సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం ఇబ్రహీంనగర్‌లో అకాల వర్షాలతో నష్టపోయిన పంటలను శుక్రవారం మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు పరిశీలించారు. ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో 24,000 ఎకరాల్లో నష్టం జరిగిందని, సిద్దిపేటలో ఎక్కువ నష్టం వాటిల్లిందని, రైతులను తప్పక ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

Next Story