- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG: రైతులకు మంత్రి తుమ్మల మరో శుభవార్త
తెలంగాణ రైతుల ఖాతాల్లో రైతుభరోసా(Rythu Bharosa) నిధుల జమ కొనసాగుతోంది.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రైతుల ఖాతాల్లో రైతుభరోసా(Rythu Bharosa) నిధుల జమ కొనసాగుతోంది. నిన్న ఐదు ఎకరాల వరకు ఉన్న రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయగా, నేడు 7 ఎకరాల వరకు ఉన్న రైతుల అకౌంట్లలో నిధులు జమ చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Tummala Nageswara Rao) తెలిపారు. ఇందుకు మరో రూ.905.89 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. తొమ్మిది రోజుల్లో వానాకాలం రైతుభరోసా మొత్తం పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఇచ్చిన హామీ మేరకు.. వరుసగా 5వ రోజు 7 ఎకరాల వరకు రైతుభరోసా నిధులను విడుదల చేసినట్టు మంత్రి తుమ్మల తెలిపారు. శుక్రవారం మరో రూ.905.89 కోట్లు విడుదల చేయగా, దీంతో 2.64 లక్షల మంది రైతులు లబ్ధి పొందారని మంత్రి పేర్కొన్నారు. కేవలం 5 రోజుల్లోనే రూ.7310.59 కోట్లు విడుదల చేసామని, ఇప్పటివరకు మొత్తం 65.12 లక్షల మంది రైతులు రైతు భరోసా సహాయాన్ని అందుకున్నారని అన్నారు. ఎకరాలతో సంబంధం లేకుండా మిగిలిన రైతులకు కూడా రైతుభరోసా సహాయని అందచేస్తామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.






