పలుకుబడి ఉంటే యూరియా తెప్పించి మాట్లాడు.. బీజేపీ చీఫ్‌కు మంత్రి తుమ్మల కౌంటర్

by Gantepaka Srikanth |

తెలంగాణలో యూరియా కొరతపై మంత్రి తుమ్మల నాగేశ్వర రావు(Tummala Nageswara Rao) కీలక వ్యాఖ్యలు చేశారు.

పలుకుబడి ఉంటే యూరియా తెప్పించి మాట్లాడు.. బీజేపీ చీఫ్‌కు మంత్రి తుమ్మల కౌంటర్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో యూరియా కొరతపై మంత్రి తుమ్మల నాగేశ్వర రావు(Tummala Nageswara Rao) కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెలాఖరు వరకు మా వాటా యూరియా ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ప్రతి నెలా యూరియా కోసం సీఎం రేవంత్ రెడ్డి అడిగారని గుర్తుచేశారు. కేవలం యూరియా కోసం ఒక అధికారిని ఢిల్లీలోనే పెట్టామని అన్నారు. దేశవ్యాప్తంగా యూరియా సమస్య ఉంది.. కేవలం తెలంగాణలోనే సమస్య ఉందనడం సరికాదని అన్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు(Ramchander Rao) తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. రాంచందర్‌రావుకు పలుకుబడి ఉంటే యూరియా తెప్పించాలని తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. కాగా, అంతకుముందు రాష్ట్రంలో యూరియా బఫర్‌ స్టాక్‌ గురించి ఎందుకు చెప్పడం లేదని రాంచందర్‌రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. మీ వద్ద బఫర్‌ స్టాక్‌ ఉంచుకుని, కేంద్రం యూరియా ఇవ్వడం లేదని ఎందుకు ప్రచారం చేస్తున్నారు? అని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు విధానాల కారణంగా యూరియా కృత్రిమ కొరత ఏర్పడింది. తాను చెప్పినదాంట్లో ఒక్క అక్షరం తప్పుంటే రాజీనామా చేస్తా.. లేకుంటే మీరు రాజీనామా చేయాలి’ అని మంత్రి తుమ్మలకు రాంచందర్‌రావు సవాల్‌ చేశారు. దీనిపై ఇవాళ తుమ్మల స్పందించి కౌంటర్ ఇచ్చారు.

Next Story