- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గ్రామీణ అభివృద్దికి సహకార సంఘాలే కీలకం: మంత్రి తుమ్మల
గ్రామీణ అభివృద్ధి కేంద్రంగా సహకార వ్యవస్థను తెలంగాణ బలోపేతం చేస్తోందని, 25.35 లక్షల రైతు కుటుంబాలకు పెట్టుబడి సహాయం, ఆదాయ మద్దతు, రైతు బీమా కల్పించినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు పేర్కొన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో : గ్రామీణ అభివృద్ధి కేంద్రంగా సహకార వ్యవస్థను తెలంగాణ బలోపేతం చేస్తోందని, 25.35 లక్షల రైతు కుటుంబాలకు పెట్టుబడి సహాయం, ఆదాయ మద్దతు, రైతు బీమా కల్పించినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు పేర్కొన్నారు. గ్రామీణ అభివృద్ధికి సహకార సంఘాలే కీలకమని, వ్యవసాయంలో సహకార వ్యవస్థతో పెద్ద మార్పులు వచ్చినట్లు సహకార బ్యాంకుల డిపాజిట్లు పెంచి దేశ సహకార రంగానికి తెలంగాణ మార్గదర్శిగా కావాలన్నారు. సోమవారం ప్రైవేటు హోటల్లో జరిగిన సహకార వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా హజరైయ్యారు.
ఈసందర్భంగా మాట్లాడుతూ 1.89 కోట్ల టన్నుల వరి ఉత్పత్తితో దేశంలో రెండో స్థానం ఉండగా పప్పుధాన్యాలు, మిర్చి, పసుపు, ఆయిల్‌పామ్‌లో ప్రత్యేక గుర్తింపు పొందినట్లు తెలిపారు. ఉద్యానవన ఉత్పత్తి 42 లక్షల టన్నులు పెరిగినట్లు చెప్పారు. భవిష్యత్తుల్లో సహజ వ్యవసాయం 4 వేల గ్రామాల్లో అమలు లక్ష్యంగా 39.5 లక్షల ఎకరాలకు సూక్ష్మ నీటిపారుదల విస్తరణ మెగా క్లస్టర్లు, విత్తన హబ్‌లు, ప్రాసెసింగ్ కేంద్రాలు, కోల్డ్ స్టోరేజ్ అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు. అదే విధంగా సహకార వ్యవస్థ బలోపేతం చేస్తామని, 197 కొత్త ఎమ్‌పీఏసీఎస్‌లు, పీఏసీఎస్‌ల కంప్యూటరైజేషన్ డిజిటల్ బ్యాంకింగ్, ఆధార్ చెల్లింపులు సహకారంతో గ్రామీణ సంపద సాధ్యమని తెలిపారు.






