కోహెడ్​ మార్కెట్​ను ఆదర్శవంతమైన మార్కెట్​గా తీర్చిదిద్దుతాం : మంత్రి తుమ్మల

by Ajay Maddhiboyina |

రాష్ట్రంలో వ్యవసాయ మార్కెటింగ్ వ్యవస్థను మరింత బలోపేతం చేయడం, రైతులకు ఆధునిక సౌకర్యాలతో కూడిన మార్కెట్ వసతులను అందించడం ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్​శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు.

కోహెడ్​ మార్కెట్​ను ఆదర్శవంతమైన మార్కెట్​గా తీర్చిదిద్దుతాం : మంత్రి తుమ్మల
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో వ్యవసాయ మార్కెటింగ్ వ్యవస్థను మరింత బలోపేతం చేయడం, రైతులకు ఆధునిక సౌకర్యాలతో కూడిన మార్కెట్ వసతులను అందించడం ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్​శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. కోహెడ మార్కెట్ భవిష్యత్తులో రాష్ట్రానికి ఆదర్శవంతమైన వ్యవసాయ మార్కెట్‌గా రూపుదిద్దుకునేలా అన్ని చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. బుధవారం సచివాలయంలో కోహెడ్​మార్కెట్​శంకు స్ధాపన కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.

ఈసందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి హాజరయ్యే కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు వివిధ శాఖల హెచ్‌వోడీలు, రాష్ట్రస్థాయి అధికారులను నోడల్ అధికారులుగా నియమించినట్లు తెలిపారు. వేదిక నిర్మాణం, ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా ఏర్పాట్లు, పార్కింగ్, తాగునీరు, విద్యుత్, పారిశుధ్యం, వైద్య సదుపాయాలు, మీడియా సమన్వయం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమ ప్రాంగణంలో శుభ్రత, ట్రాఫిక్ మళ్లింపు, వాహనాల పార్కింగ్, ప్రజల రాకపోకల నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. కోహెడ మార్కెట్ శంకుస్థాపన కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నందున అన్ని శాఖల అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

Next Story