పత్తిలో తేమ.. కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నాం: మంత్రి తుమ్మల

by Prasad Jukanti |   (  Updated:2025-10-27 06:57:32  IST  )

పత్తి రైతులకు మంత్రి తుమ్మల కీలక సూచన చేశారు.

పత్తిలో తేమ.. కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నాం: మంత్రి తుమ్మల
X

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: కొనుగోలు కేంద్రాలకు తీసుకురాకముందే పత్తిలో తేమ శాతాన్ని రైతులు తనిఖీ చేసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) సూచించారు. తేమ శాతం 12కు మించకూడదని తేమ శాతం (Moisture content) ఎక్కువైతే మద్దతు ధర లభించదన్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని తేమ శాతం ఎక్కువ ఉన్న కూడా పత్తిని కొనుగోలు చేయాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నామని చెప్పారు. ఇవాళ మంత్రి తుమ్మల ఓ ప్రకటన విడుదల చేశారు. పత్తి రైతులకు మద్దతు ధర కల్పించేందుకు మా ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని ఈ మేరకు సెప్టెంబర్ లోనే కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ చౌహాన్ కు లేఖ రాసినట్లు పేర్కొన్నారు. కపాస్ కిసాన్ యాప్‍లో రిజిస్ట్రర్ చేసుకోవడం కోసం ప్రభుత్వం నియమించిన ప్రత్యేక అధికారిక బృందాలు జిల్లాలో పర్యటిస్తుంటారని, ఏఈఓలు, మార్కెట్ సెక్రటరీలు, జిల్లా మార్కెటింగ్ అధికారులు రైతులకు అందుబాటులో ఉంటారని తెలియజేశారు. పత్తి రైతుల కోసం టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేశామని, రైతులకు ఎలాంటి సందేహాలు, ఫిర్యాదులు ఉన్నా టోల్ ఫ్రీ నెంబర్ 1800 599 5779 ను వెంటనే సంప్రదించగలన్నారు.

Next Story