- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Thummala: వడగండ్ల వాన బీభత్సం.. అధికారులకు మంత్రి తుమ్మల కీలక ఆదేశాలు
వడగళ్లకు దెబ్బతిన్న పంటలను పరిశీలించి ప్రాథమిక నివేదిక అందించాలని అధికారులను మంత్రి తుమ్మల ఆదేశించారు.

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: అకాల వర్షాలు (Untimely rains) రాష్ట్రంలో బీభత్సం సృష్టిస్తోంది. నిన్న రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో గాలివానస, వడగండ్ల వాన పంటలను అతలాకుతలం చేసింది. ఈ నేపథ్యంలో వ్యవసాయశాఖ (Agriculture Department)అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageswara Rao) అప్రమత్తం చేశారు. అకాల వర్షాలు, వడగళ్లకు దెబ్బతిన్న పంటలను పరిశీలించి ప్రాథమిక నివేదిక అందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. పలు చోట్ల కొనుగోలు కేంద్రాల్లో పోసిన ధాన్యం రాశులపై కప్పేందుకు టార్పాలిన్ కవర్లు లేక రైతుల ధాన్యం వర్షం పాలైంది. దీంతో మార్కెట్లోకి వచ్చిన పంట ఉత్పత్తులను జాగ్రత్తగా కాపాడాలని మార్కెటింగ్ అధికారులను మంత్రి ఆదేశించారు. కొనుగోలు చేసిన ఉత్పత్తులను వెంటనే గోదాములకు తరలించాలని మార్క్‌ఫెడ్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో నేడు, రేపు, ఎల్లుండి కూడా పలు ప్రాంతాల్లో తేలకపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్నే ఆదేశించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని సీఎస్ ను ఆదేశించారు.






