- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Thummala: కాళేశ్వరం కమిషన్ విచారణ కీలక మలుపు.. ఈటలకు మంత్రి తుమ్మల కౌంటర్
కాళేశ్వరం కమిషన్ విచారణ కీలక మలుపు తిరుగుతోంది.

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: కాళేశ్వరం కమిషన్ విచారణ (Kaleswaram Commission) కీలక మలుపులు తిరుగుతోంది. దర్యాప్తులో భాగంగా మాజీ మంత్రులు ఈటల రాజేందర్, హరీశ్ రావుతో పాటు మాజీ సీఎం కేసీఆర్ ను విచారించిన కమిషన్ తాజాగా గత ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు కు సంబంధించిన మంత్రివర్గ తీర్మానాల వివరాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం ఇంట్రెస్టింగ్ గా మారింది. ఈ నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ కేబినెట్ ఆమోదంపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాట్ కామెంట్స్ చేశారు. ఇవాళ మంత్రులతో ముఖాముఖీ కార్యక్రమంలో పాల్గొనేందుకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) గాంధీ భవన్ కు వచ్చారు. ఈ సందర్భంగా అక్కడే మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన ఆయన.. గతంలో నేను కేబినెట్ లో ఉన్నప్పుడు కాళేశ్వరం ఫైనల్ నివేదిక రాలేదని స్పష్టం చేశారు. పెండింగ్ ప్రాజెక్ట్ లు, ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ ల పైనే సబ్ కమిటీ వేశారు. సబ్ కమిటీ కేవలం రికమండేషన్స్ చేస్తుంది అంతేనన్నారు. ప్రాణహితతో పాటు అన్ని పెండింగ్ ప్రాజెక్టులపై సబ్ కమిటీ వేశారు మేడిగడ్డ శాంక్షన్ కేబినెట్ ముందుకు కానీ, సబ్ కమిటి ముందుకు రాలేదు. కాళేశ్వరం కమిషన్ ముందు మాజీ మంత్రి, ఎంపీ ఈటల రాజేందర్ అసత్యాలు మాట్లాడారంటూ కౌంటర్ ఇచ్చారు. నిన్న కాళేశ్వరం కమీషన్ అడిగిన లేఖ ప్రభుత్వంకు అందిందని కమిషన్ కోరిన వివరాలను ఇప్పటికే ప్రభుత్వం ఇచ్చి ఉంటుందని అభిప్రాయపడ్డారు.






