- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మానసిక సమస్యలకు మంత్రి శ్రీధర్ బాబు సొల్యూషన్
సమాజంలో వేగంగా పెరుగుతున్న ఒత్తిడి, ఆందోళన తదితర మానసిక సమస్యలకు పరిష్కారం చూపించగల శక్తి సామర్థ్యం టెక్నాలజీకి ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: సమాజంలో వేగంగా పెరుగుతున్న ఒత్తిడి, ఆందోళన తదితర మానసిక సమస్యలకు పరిష్కారం చూపించగల శక్తి సామర్థ్యం టెక్నాలజీకి ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. బుధవారం సైబర్ హోప్ హెల్ప్ ఇనిషియేటివ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన ఏఐ ఆధారిత మెంటల్ హెల్త్ సపోర్ట్ సిస్టం హోప్ ఐను మంత్రి బుధవారం రాయదుర్గం లోని టీ-హబ్‌లో లాంఛనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇన్నోవేషన్ హబ్‌గా తెలంగాణ తీర్చిదిద్దాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని అన్నారు. ప్రజల ప్రాణాలను కాపాడే ఆవిష్కరణలకు అన్ని రకాలుగా ప్రభుత్వం అండగా ఉంటుందని వివరించారు. ఆ దిశగా దృష్టి సారించి ప్రస్తుతం సమాజం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాలను కనుక్కోవాలని యువ ఆవిష్కర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో టీ హబ్ సీఈవో కవికృత్, సైబర్ హోప్ హెల్ప్ ఇనిషియేటివ్ ఫౌండేషన్ ఛైర్మన్ ఇన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు.






