- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వర్షాలపై మంత్రి శ్రీధర్ బాబు సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు
భారీ వర్షాల(Heavy Rain) నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.

దిశ, వెబ్‌డెస్క్: భారీ వర్షాల(Heavy Rain) నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో పాటు హైదరాబాద్ ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను అప్రమత్తం చేశారు. తాజాగా మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) అధికారులకు ఫోన్ చేశారు. నిత్యం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ముఖ్యంగా విద్యుత్ అధికారులు ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలని చెప్పారు.
ఇదిలా ఉంటే.. ఇవాళ హైదరాబాద్‌లో భారీగా వర్షపాతం నమోదైంది. అత్యధికంగా గచ్చిబౌలిలో 12.3 సెం.మీ, శ్రీనగర్‌కాలనీలో 11.1, ఖైరతాబాద్‌లో 10.8 సెం.మీ, యూసుఫ్‌గూడలో 10.4 సెం.మీ, ఉప్పల్‌లో 9.5 సెం.మీ, ఎల్బీనగర్‌లో 9.3 సెం.మీ, బంజారాహిల్స్‌లో 9 సెం.మీ, నాగోల్‌లో 8.5 సెం.మీ, గోల్కొండ 7.9, బోరబండ 7.5 సెం.మీ వర్షపాతం నమోదైంది.
అధికారుల ఫోన్ నెంబర్లు :
NDRF = 8333068536,
ఐసీసీసీ = 8712596106
హైడ్రా = 9154170992
ట్రాఫిక్ = 8712660600
సైబరాబాద్ = 8500411111
రాచకొండ = 8712662999
TGSPDCL = 7901530966
RTC = 9444097000
GHMC = 8125971221
HMWSSB = 9949930003






