- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Sridhar Babu: గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లు ఆలస్యం.. మంత్రి శ్రీధర్ బాబు ఆగ్రహం
అవసరం అయితే మూడు షిఫ్టుల్లో పని చేసి పనులు వేగంగా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేయడంతో పాటు ప్రపంచ దిగ్గజ సంస్థల నుంచి రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించేలా ఫ్యూచర్ సిటీలో (Future City) తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు (Telangana Rising Global Summit) ప్రభుత్వం ఏర్పాట్లు ముమ్మరం చేసింది. డిసెంబర్ 8, 9వ తేదీల్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహిచబోయే ఈ ఈవెంట్‍కు అంతర్జాతీయ, జాతీయ ప్రతినిధులను ప్రభుత్వం ఆహ్వానిస్తోంది. ఈ క్రమంలో ఫ్యూచర్ సిటీలో జరుగుతున్న ఏర్పాట్లపై ఇవాళ మంత్రి శ్రీధర్ బాబు (Sridhar Babu) సీఎస్, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా గ్లోబల్ సమ్మిట్ పనుల పురోగతి గురించి మంత్రికి అధికారులు వివరించారు. అయితే పనులు నెమ్మదిగా జరుగుతుండటంతో ఆర్ అండ్ బీ అధికారులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అవసరం అయితే 3 షిప్టుల్లో పని చేసి పనులు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు.
తెలంగాణ రైజింగ్ అంటే కేవలం వ్యాపారం, వాణిజ్యం మాత్రమే కాదు:
ఈ సందర్భంగా ఓ న్యూస్ చానల్‍తో మాట్లాడిన శ్రీధర్ బాబు 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ ఎకానమి వ్యవస్థగా మార్చడమే తమ లక్ష్యం అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక ఎంఎస్ఎంఈ పాలసీ తీసుకు వచ్చామన్నారు. తెలంగాణ రైజింగ్ అంటే కేవలం వ్యాపారం, వాణిజ్యం మాత్రమే కాదని సంక్షేమంతో పాటు అభివృద్ధిని సమానంగా ముందుకు తీసుకువెళ్తామన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో సిద్ధాంతపరమైన విభేదాలు ఉన్నప్పటికీ రాష్ట్ర అభివృద్ధి విషయంలో తాము భేషజాలకు వెళ్లబోమన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకరిస్తాం.






