- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘అడ్డంగా నరుకుతం’ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ వ్యాఖ్యలపై శ్రీధర్ బాబు క్లారిటీ
రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ వివాదాస్పద వ్యాఖ్యలపై మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: రామగుండం ఎమ్యెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ (Makkan Singh Raj Thakur) చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. బాధ్యతాయుతమైన ఎమ్మెల్యే పదవిలో ఉంటూ ఈ మాటలేంటంటూ రాజ్ ఠాకూర్ తీరుపై సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై మంత్రి శ్రీధర్ బాబు (Sridhar బాబు) స్పందించారు. తాజాగా మీడియాతో మాట్లాడిన శ్రీధర్ బాబు రాజ్ ఠాకూర్ శాంతిని కోరుకునే వ్యక్తి అని కాంగ్రెస్ కార్యకర్తలను చాలా మంది బెదిరిస్తున్నారని కార్యకర్తలకు ధైర్యం చెప్పే క్రమంలో ఆయన అలా మాట్లాడారని చెప్పారు. కార్యకర్తలు తమ బాధలు చెప్పినప్పుడు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాజ్ ఠాకూర్ అలా స్పందించారని అన్నారు. శాంతికి విఘాతం కలిగించే ఆలోచనలు ఎవరు చేసినా తాము ఖండిస్తామన్నారు.
ఇంతకూ మక్కాన్ సింగ్ ఏమన్నారు?:
నిన్న మంథనిలో మంత్రి శ్రీధర్ బాబుతో పాటు పలువురు పార్టీ నేతలు పాల్గొన్న కార్యక్రమంలో రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ.. మంథనిలో ప్రతి రోజు శ్రీధర్ బాబు ఉండకపోవచ్చు. కానీ కాంగ్రెస్ కార్యకర్తలకు ఎవరైనా బెదిరించినా, ఏదైనా జరిగితే మేం 2 గంటల్లో వస్తాం. ఎవరైనా అడ్డంగా మాట్లాడితే వారిని అడ్డంగా నరుకుతాం అని అన్నారు. ఈ కామెంట్స్ పొలిటికల్‍గా తీవ్ర దుమారం రేపుతున్నాయి.






