ఏపీ మంత్రుల ప్రకటనలు పట్టించుకోం: మంత్రి శ్రీధర్ బాబు షాకింగ్ స్టేట్మెంట్

by Gantepaka Srikanth |

బనకచర్ల ప్రాజెక్టు(Banakacharla Project)పై మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) కీలక వ్యాఖ్యలు చేశారు.

ఏపీ మంత్రుల ప్రకటనలు పట్టించుకోం: మంత్రి శ్రీధర్ బాబు షాకింగ్ స్టేట్మెంట్
X

దిశ, వెబ్‌డెస్క్: బనకచర్ల ప్రాజెక్టు(Banakacharla Project)పై మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) కీలక వ్యాఖ్యలు చేశారు. బనకచర్లను వ్యతిరేకిస్తున్నామని ప్రకటించారు. కృష్ణా, గోదావరి నీటి వాటాలు తేల్చిన తర్వాతే కొత్త ప్రాజెక్టుల గురించి మాట్లాడుకోవాలని సూచించారు. ఏపీ మంత్రుల ప్రకటనలు తాము పట్టించుకోం అని అన్నారు. కాళేశ్వరంపై నివేదిక ఆధారంగా చర్యలుంటాయని చెప్పారు. అంతకుముందు బనకచర్లపై లోకేష్ వ్యాఖ్యలకు మంత్రి పొన్నం కౌంటర్ ఇచ్చారు. నికర, మిగులు, వరద జలాల గురించి తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. ప్రాజెక్టులు నీటి వినియోగం పూర్తైతే వరద జలాలు లెక్కలోకి వస్తాయని అన్నారు. తెలంగాణకు రావాల్సిన నీటి వాటాలో చుక్క కూడా వదులుకోం అని స్పష్టం చేశారు. అసమానతలు రెచ్చగొడుతున్నారన్న లోకేష్ వ్యాఖ్యలు సరికావని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు.

Next Story