- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ముఖ్యమంత్రి పదవిపై శ్రీధర్ బాబు మనసులోని మాట..
ముఖ్యమంత్రి పదవిపై తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి పదవిపై తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం అసెంబ్లీ ఆవరణలో మీడియాతో చిట్‌చాట్ చేశారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి విషయంలో పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ చొరవ చూపాలని అభిప్రాయపడ్డారు. జీవన్ రెడ్డి పార్టీ మారొద్దని తాను కోరుతున్నట్లు తెలిపారు. జగ్గారెడ్డి అంటే అందరికీ ఇష్టమే.. పీసీసీపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన మనసులోని మాట చెప్పారని క్లారిటీ ఇచ్చారు. పీసీసీ పదవిపై అధిష్టానానిదే తుది నిర్ణయమన్నారు. ‘నామినేటెడ్ పదవులపై కసరత్తు జరుగుతోంది. పోర్ట్ ఫోలియోల కేటాయింపులపై సీఎందే తుది నిర్ణయం. కేసీఆర్ గొప్ప అనుభవజ్ఞుడు.. ఆయన సభకు రావాలి. ఆయన సలహాలు సూచనలు స్వీకరిస్తాం. మళ్లీ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి ఎవరనేది ఏఐసీసీ నిర్ణయం తీసుకుంటుంది’ అని శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.
అంతకుముందు కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగ్గారెడ్డి ఎప్పుడూ ప్రజల మధ్య ఉండే మాస్ లీడర్ అని, ఆయన పనితీరు అమోఘమని ప్రశంసించారు. దివంగత నేత పి.జనార్ధన్ రెడ్డి (PJR) తరహాలో జగ్గారెడ్డికి ఆపదలో ఉన్నవారిని ఆదుకునే గుణం ఉందని, ఆయన్ని 'మరో పీజేఆర్'గా అభివర్ణించారు. ఒకవేళ జగ్గారెడ్డికి పీసీసీ పగ్గాలు అప్పగిస్తే, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సునాయాసంగా 100 సీట్లు గెలుచుకుంటుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం మహేశ్ కుమార్ గౌడ్ పీసీసీ చీఫ్‌గా కొనసాగుతుండగా, కోమటిరెడ్డి వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.






