దాని గురించి ఇప్పుడేం మాట్లాడను.. మాట్లాడకూడదు కూడా: మంత్రి శ్రీధర్ బాబు

by Gantepaka Srikanth |

జపాన్ పర్యటన(Japan Tour)పై మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) కీలక వ్యాఖ్యలు చేశారు.

దాని గురించి ఇప్పుడేం మాట్లాడను.. మాట్లాడకూడదు కూడా: మంత్రి శ్రీధర్ బాబు
X

దిశ, వెబ్‌డెస్క్: జపాన్ పర్యటన(Japan Tour)పై మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెల 16 నుండి 21 వరకు.. అంటే దాదాపు వారం రోజుల పాటు జపాన్‌లో పర్యటించనున్నట్లు తెలిపారు. ఈ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)తో పాటు పలువురు మంత్రులు, అధికారులు కూడా ఉంటాయని చెప్పారు. మొదటి సారి జపాన్‌లో నిర్వహించే ఒకాస ఇండస్ట్రియల్ ఎక్స్ పోలో ఇండియన్ పెవిలియన్(Indian Pavilion) ఏర్పాటు చేశారని తెలిపారు. కేంద్రం కేటాయించిన పెవిలియన్‌లోనే రాష్ట్ర ప్రభుత్వ స్టాల్ ఏర్పాటు చేస్తామని.. ఇతర రాష్ట్రాలు కూడా పాల్గొంటాయి.. అందరికీ ఒకటే పెవిలియన్ అని అన్నారు.

ఇండియన్ గవర్నమెంట్ ఏర్పాటు చేసిన పెవిలియన్‌ను అన్ని రాష్ట్రాలు సంయుక్తంగా ఉపయోగించుకోనున్నాయని తెలిపారు. పెవిలియన్‌ను రోజు వారిగా రాష్ట్రాలకు కేటాయించిన విధంగా వినియోగించుకుంటామని అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన స్టాల్ రెండు రోజుల పాటు ఉంటుంది. ఇక్కడ రాష్ట్రంలో పెట్టుబడులకు అవకాశాలు వివరిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో ప్రధాని మోడీ(PM Modi) కూడా పాల్గొని ప్రసంగిస్తానని వెల్లడించారు. అనంతరం చివర్లలో హెచ్‌సీయూ(HCU) భూముల వివాదంపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. ఇప్పుడా అంశం కోర్టు పరిధిలో ఉన్నది.. నేనే మాట్లాడను, మాట్లాడకూడదు కూడా అని శ్రీధర్ బాబు చెప్పుకొచ్చారు.

Next Story