- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణ జర్నలిస్టులను అక్కడకు తీసుకెళ్లండి.. ఆ చైర్మన్‌కు మంత్రి శ్రీధర్‌బాబు విజ్ఞప్తి
ఓవైపు బీజేపీ విమర్శలు, మరోవైపు మూసీ అభివృద్ధిపై మీడియాలో వస్తున్న వార్తలపై పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు శనివారం స్పందించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ఓవైపు బీజేపీ విమర్శలు, మరోవైపు మూసీ అభివృద్ధిపై మీడియాలో వస్తున్న వార్తలపై పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు శనివారం స్పందించారు. మీడియా ప్రతినిధులను సబర్మతికి తీసుకుని వెళ్ళాలని, ఈ సందర్భంగా మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డికి మంత్రి శ్రీధర్‌బాబు విజ్ఞప్తి చేశారు. మూసీ అభివృద్ధిలో ఇచ్చే సలహాలు సూచనలు తీసుకుంటామన్నారు. మూసీ అభివృద్ధిలో సైతం అన్ని వర్గాల వారు ఉన్నారన్నారు. కానీ దురుద్ధేశాలతో అభివృద్ధికి కులాన్ని అపాదించవద్దని కొందరిని ఉద్దేశించి మంత్రి శ్రీధర్‌బాబు వ్యాఖ్యానించారు. సబర్మతి పరివాహక ప్రాంత వాసులకు మేలు జరగాలని అక్కడ బీజేపీ అభివృద్ధి చేసిందని, అదే అభివృద్ధి తెలంగాణ హైదరాబాద్ మూసిలో బీజేపీ వద్దు అంటుందన్నారు. సబర్మతి అభివృద్ధిలో అన్ని వర్గాల వారు ఉన్నారని, తాము కూడా సబర్మతికి వెళ్లి విజిట్ చేసి వచ్చామన్నారు. సబర్మతి నది అభివృద్ధికి ముందు అభివృద్ధికి తరువాతి పరిస్థితులను సేకరించండని అన్నారు.






