- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏఐ సాయంతో ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసే యత్నం.. ముందే ఫోటో లీక్! మంత్రి శ్రీధర్ బాబు
పదేళ్ల పాలనలో ప్రజల హక్కులను అన్ని రకాలుగా హరించిన బీఆర్‌ఎస్‌కు తమ నాయకులను విమర్శించే అర్హత లేదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు విమర్శించారు.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: పదేళ్ల పాలనలో ప్రజల హక్కులను అన్ని రకాలుగా హరించిన బీఆర్‌ఎస్‌కు తమ నాయకులను విమర్శించే అర్హత లేదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు (Sridhar Babu) విమర్శించారు. హెచ్ఐసీసీ నోవాటెల్ లో జరుగుతున్న అంతర్జాతీయ రాజకీయ సదస్సు "భారత్ సమ్మిట్ (Bharat Summit) 2025"లో "న్యాయ పథ్(Path of Justice)" పేరిట ఏర్పాటు చేసిన ప్రత్యేక చిత్ర ప్రదర్శనను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. ఇతర దేశాలతో భారత్ కున్న సత్సంబంధాలు, చారిత్రక ఘటనలను నేటి తరానికి తెలియజేయాలనే సంకల్పంతోనే ఈ ప్రదర్శనను ఏర్పాటు చేశామన్నారు. ప్రపంచ ప్రగతిశీల ఉద్యమానికి మార్గ నిర్దేశం చేసేలా ఈ సదస్సును నిర్వహించామన్నారు.
ప్రగతిశీల ఆలోచనలు, ప్రజాస్వామ్యం, ప్రపంచ శాంతి తదితర అంశాల్లో పనిచేసే 100 దేశాలకు చెందిన మేధావులను ఈ ప్రక్రియలో భాగస్వామ్యం చేశామన్నారు. మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ మార్గ నిర్దేశంలో రాజ్యాంగ స్ఫూర్తిని పరిరక్షించేందుకు కాంగ్రెస్ పార్టీ నిరంతరం కృషి చేస్తోందన్నారు. ఏఐ సాయంతో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని మా ప్రభుత్వాన్ని అప్రతిష్ఠ పాలు చేసేందుకు బీఆర్ఎస్ నాయకులు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఈ ప్రదర్శనలో ఏర్పాటు చేసిన ఫోటోలను రెండు రోజుల ముందే సోషల్ మీడియాలో విడుదల చేయడం వెనుక ఆంతర్యమేంటని ప్రశ్నించారు. ఇప్పటికైనా తీరు మార్చుకోవాలని బీఆర్‌ఎస్ నాయకులకు సూచించారు.






