తులం బంగారం హామీ అమలుపై మంత్రి శ్రీధర్ బాబు హాట్ కామెంట్స్

by Prasad Jukanti |

కెబినెట్ మంత్రులు, సీఎంకు మధ్య విభేదాలు ఉన్నాయనే అంశంపై మంత్రి శ్రీధర్ బాబు రియాక్ట్ అయ్యారు.

తులం బంగారం హామీ అమలుపై మంత్రి శ్రీధర్ బాబు  హాట్ కామెంట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీల హామీలపై జోరుగా చర్చ నడుస్తోంది. ఆరు గ్యారెంటీల పేరు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం రెండున్నరేళ్లు గడుస్తున్నా ప్రధానమైన హామీలు అమలు చేయకుండా మొండి చేయి చూపించిందని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తుంటే మేమిచ్చిన హామీలను అమలు చేస్తున్నామని అధికార పక్షం కౌంటర్ ఇస్తోంది. ఈ క్రమంలో హామీల అమలుపై తాజాగా మంత్రి శ్రీధర్ బాబు (Sridhar Babu) హాట్ కామెంట్స్ చేశారు. మేమిచ్చిన వాటిల్లో మెజార్టీ హామీలు అమలవుతున్నాయని మిగతావి కూడా త్వరలోనే అమలు చేయబోతున్నామని చెప్పారు. తాజాగా ఓ యూట్యూబ్ చానల్‍కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన అనేక అంశాలపై మాట్లాడారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై స్పందిస్తూ.. మేమిచ్చిన అన్ని హామీలు నూటికి నూరు శాతం అమలు చేయబోతున్నామని, తులం బంగారం హామీ కూడా అమలు చేస్తామని స్పష్టం చేశారు.

హామీల అమలు తర్వాతే ఎన్నికలకు:

ఈ ఐదేళ్ల టర్మ్ లోపే మేమిచ్చిన హామీలన్నీ అమలు చేశాకే మళ్లీ ప్రజల వద్దకు వెళ్తామన్నారు. మేము ఇచ్చిన మేనిఫెస్టోలో 420 హామీలు లేవని కావాలనే నంబర్ చెప్పి ప్రజలను పక్కదారి పట్టించేలా బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్‍కు ప్రజలకు ఏ రకంగా పక్కదారి పట్టించాలనే జిమ్మిక్కు తెలుసు. మేము చాలా ప్రాక్టికల్ గా ఉంటూ ప్రజలకు ఆచరణ యోగ్యమైన కార్యక్రమాలు చేపడదామని చూస్తున్నాం. కొద్దిగా ఆలస్యం అయినా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చూస్తున్నామన్నారు.

సీఎంకు, మంత్రులకు మధ్య గ్యాప్‍పై:

ముఖ్యమంత్రి ఓ కెప్టెన్‍గా ముందుకు వెళ్తున్నారని కెబినెట్ మంత్రులంతా సీఎంతో సమన్వయంతో పని చేస్తున్నారని శ్రీధర్ బాబు క్లారిటీ ఇచ్చారు. ముఖ్యమంత్రికి, మంత్రులకు మధ్య విభేదాలు ఉన్నాయని మీడియాలో వస్తున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదన్నారు. పీసీసీ రేస్‍లో శ్రీధర్ బాబు ఉన్నారు అని జరుగుతున్న ప్రచారంపై స్పందిస్తూ బీసీ బిడ్డ మహేశ్ కుమార్ గౌడ్ పార్టీని సమర్థవంతంగా నడిపిస్తున్నారని చెప్పారు. మేము అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే ప్రతిపక్షాలు కాళ్లలో కట్టెలు పెట్టే ప్రయత్నం చేస్తోందని ఈ పద్ధతి మానుకోవాలన్నారు.

Next Story