- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సమయం వచ్చినప్పుడే చెబుతాం.. హరీష్ రావుకు శ్రీధర్ బాబు కౌంటర్
జీహెచ్ఎంసీ ఏరియాను మూడు కార్పొరేషన్లుగా విభజించాలని అంశాన్ని సమయం వచ్చినప్పుడు ప్రకటిస్తామని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.

దిశ, తెలంగాణ బ్యూరో: జీహెచ్ఎంసీ ఏరియాను మూడు కార్పొరేషన్లుగా విభజించాలని అంశాన్ని సమయం వచ్చినప్పుడు ప్రకటిస్తామని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. జీహెచ్ఎంసీ విభజన, అప్పులు, హెచ్ఎండీఏ రుణప్లాన్ వంటి అంశాలపై హరీష్ రావు అడిగిన ప్రశ్నలకు సమధానంగా మాట్లాడుతూ.. బీఏసీలో నిర్ణయించిన తర్వాత నూటికినూరు శాతం సభకు హాజరవుతామని చెప్పిన బీఆర్ఎస్ సభ్యులు.. కృష్ణా జలాలపై బయట పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడంతోపాటు స్పీకర్‌పై ఆరోపణలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రశ్నలు అడిగి సభకు రాకపోవడం వాళ్ల చిత్తశుద్ది బయటపడిందన్నారు. డిసెంబర్ 31,2025 నాటికి జీహెచ్ఎంసీ అప్పులు రూ.4,717.81కోట్లు ఉందని, గడిచిన 12 నెలల్లో ఎలాంటి రుణం తీసుకోలేదని చెప్పారు. హెచ్ఎండీఏ మాత్రం రూ.5వేల కోట్ల రుణం తీసుకోవడానికి కసరత్తు చేస్తుందని తెలిపారు. గత ప్రభుత్వం ఇష్టారాజ్యంగా లోన్లు తీసుకుని జీహెచ్ఎంసీని అప్పుల ఊబిలోకి నెట్టిందని, తమ ప్రభుత్వం జీహెచ్ఎంసీ తీసుకున్న అప్పులు, రుణాలకు సంబంధించిన వడ్డీని తగ్గించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్టు తెలిపారు.






