- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘జూబ్లీహిల్స్’లో ఎవరి వల్లో మేము గెలవలేదు.. అక్బరుద్దీన్‌కు శ్రీధర్‌బాబు కౌంటర్
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో ఎంఐఎం మద్దతుతోనే కాంగ్రెస్ విజయం సాధించిందని.. తాము మద్దతు ఇవ్వకపోతే పరిస్థితి ఏంటో కాంగ్రెస్ పెద్దలకు కూడా తెలుసని ఆ పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలకు మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు.

దిశ, వెబ్‌డెస్క్: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో ఎంఐఎం మద్దతుతోనే కాంగ్రెస్ విజయం సాధించిందని.. తాము మద్దతు ఇవ్వకపోతే పరిస్థితి ఏంటో కాంగ్రెస్ పెద్దలకు కూడా తెలుసని ఆ పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ(Akbaruddin Owaisi) చేసిన వ్యాఖ్యలకు మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) స్పందించారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఎవరి వల్లో మేము గెలవలేదు.. కాంగ్రెస్ బలంతోనే గెలిచామని స్పష్టం చేశారు. మా పార్టీ నేతలు రేయింబవళ్లు కష్టపడితేనే విజయం సాధ్యమైందని చెప్పారు. మా పాలనను చూసి ప్రజలు గెలిపించారు.. తామే గెలిపించామని అనుకుంటే పొరపాటే అని అక్బరుద్దీన్‌కు మంత్రి శ్రీధర్‌బాబు కౌంటర్ ఇచ్చారు.
అంతకుముందు అక్బరుద్దీన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో అధికారంలో ఏ పార్టీ ముఖ్యమంత్రి ఉన్నా.. ఎంఐఎం దగ్గరికి రావాల్సిందే అని కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రులుగా ఎవరు వచ్చినా ఒవైసీ సోదరుల వద్దకు ఎందుకు వస్తారో ఒక్కసారి ఆలోచించాలని ప్రజలను కోరారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల సమయంలో ఎంఐంఎం మద్దతు ఇవ్వకపోయి ఉంటే గెలుపు సాధ్యమయ్యేది కాదని అన్నారు. అధికారంలో ఎవరు ఉన్నా, వారు ఏ పార్టీ వారైనా సరే తమ వద్దకు రావాల్సిందేనని, అది కేవలం ప్రజల బలమేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు.






