- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మూసీ అభివృద్ధి ప్రాజెక్టును ఎంఆర్‌డీసీఎల్ చేపడుతుంది: మంత్రి శ్రీధర్‌బాబు కీలక వ్యాఖ్యలు
రెండో రోజు తెలంగాణ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయమం నడుస్తోంది. మూసీ పునర్జీవనం ప్రాజెక్టు పై చర్చ కొనసాగుతోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: రెండో రోజు తెలంగాణ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయమం నడుస్తోంది. మూసీ పునర్జీవనం ప్రాజెక్టు పై చర్చ కొనసాగుతోంది. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ఉస్మాన్ సాగర్ నుంచి బాపూఘాట్ వరకు మూసీ అభివృద్ధి పనులకు అధ్యయనం చేస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఐదు జోన్లుగా మూసీ అభివృద్ధి ప్రాజెక్టు విభజన జరిగిందన్నారు. త్వరలోనే డీపీఆర్‌లను తయారు చేయడం జరుగుతుందని వెల్లడించారు. ఆసియా అభివృద్ధి బ్యాంకు నిధులు ఇస్తుందని తెలిపారు. మూసీ పునరుద్ధరణకు సింగపూర్ కన్సార్టియం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. మొదటి దశలో 55 కి.మీ మేర అభివృద్ధి చేయబోతున్నట్లు తెలిపారు. ఉస్మాన్ సాగర్ నుంచి గౌరెల్లి వరకు అధ్యయనం జరుగుతోందన్నారు. గాంధీ సరోవర్ అభివృద్ధి చేయాలనే ప్రతిపాదన ఉందన్నారు. రూ.4,100 కోట్ల రుణంతో ఎంఆర్‌డీసీఎల్ మూసీ ప్రాజెక్టు అభివృద్ధి చేపట్టిందని తెలిపారు.
కాగా, యూరియా కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసనలు చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. బీఆర్ఎస్ నిరసనలపై మంత్రి శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. క్వశ్చన్ అవర్‌లో నిరసనలు ఏంటని మంత్రి మండిపడ్డారు. క్వశ్చన్ అవర్ పై ఇంట్రెస్ట్ లేదంటే చెప్పండి అని ప్రశ్నించారు. యూరియాపై కూడా చర్చించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.






