‘లివ్-లెర్న్-వర్క్-ప్లే’ అన్నీ ఒకేచోట.. ఫ్యూచర్ సిటీపై మంత్రి శ్రీధర్‌బాబు కీలక వ్యాఖ్యలు

by Ramesh Naini |

దిగ్గజ కంపెనీలు తెలంగాణ వైపు చూసేలా.. ప్రపంచంలోని ఇతర నగరాలకు రోల్ మోడల్‌గా నిలిచేలా ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ ని అభివృద్ధి చేయాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు చెప్పారు.

‘లివ్-లెర్న్-వర్క్-ప్లే’ అన్నీ ఒకేచోట.. ఫ్యూచర్ సిటీపై మంత్రి శ్రీధర్‌బాబు కీలక వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: దిగ్గజ కంపెనీలు తెలంగాణ వైపు చూసేలా.. ప్రపంచంలోని ఇతర నగరాలకు రోల్ మోడల్‌గా నిలిచేలా ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ ని అభివృద్ధి చేయాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు (Minister Sridhar Babu) చెప్పారు. రంగారెడ్డి జిల్లా మీర్ ఖాన్‌పేటలో భారత్ ఫ్యూచర్ సిటీ (Future City) డెవలప్మెంట్ అథారిటీ భవనం, గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్ – 1 నిర్మాణాలకు శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. ఇప్పుడు ప్రణాళికాబద్ధమైన నగరం అనగానే అందరికీ చంఢీఘర్ గుర్తుకొస్తుందని.. రాబోయే రోజుల్లో ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ గుర్తుకొస్తుందని చెప్పారు. ’లివ్-లెర్న్-వర్క్-ప్లే’ అనే కాన్సెప్ట్‌తో పరిశ్రమలు, ఆసుపత్రులు, పాఠశాలలు, షాపింగ్ మాల్స్ అన్నీ ఒకేచోట ఉండేలా అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ నగరాన్ని అభివృద్ధి చేయబోతున్నట్లు తెలిపారు. భావితరాల కోసం అందరం కలిసి వేస్తున్న పునాదే ఈ భారత్ ఫ్యూచర్ సిటీ అని చెప్పారు. ఇది ‘నెట్ జీరో కార్బన్ సిటీ’ అని.. ఇక్కడ పచ్చదనం ఉంటుందని.. కాలుష్యం ఉండదని.. పరిశ్రమలు వస్తాయని తెలిపారు.

Next Story