- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మంత్రి శ్రీధర్ బాబుకు పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఘన సత్కారం.. ఆ విషయంలోనే!
ఐటీ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు (IT Minister Duddilla Sridhar Babu)ను రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి (Revenue Minister Ponguleti Srinivasa Reddy) సత్కరించారు.

దిశ, వెబ్ డెస్క్: ఐటీ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు (IT Minister Duddilla Sridhar Babu)ను రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి (Revenue Minister Ponguleti Srinivasa Reddy) సత్కరించారు. శ్రీధర్ బాబు కార్యాలయానికి వెళ్లిన పొంగులేటి.. దావోస్ పర్యటన (Davos visit)లో తెలంగాణ (Telangana) రాష్ట్రానికి రూ. 1.73 లక్షల కోట్ల రూపాయిల పెట్టుబడులు సాధించడంలో ప్రముఖ పాత్ర వహించినందుకు మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబును శాలువాతో సత్కరించి (Felicitated), ప్రత్యేక కృతజ్ఞతలు (special thanks) తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు కాంగ్రెస్ నేతలు (Congress leaders) పాల్గొన్నారు.
కాగా ఇటీవల దావోస్ లో జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ (World Economic Forum) కు రాష్ట్రం నుంచి రైజింగ్ తెలంగాణ (Rising Telangana) పేరుతో పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), ఐటీ మంత్రి శ్రీదర్ బాబు సహా ప్రత్యేక అధికారుల బృందం వెళ్లారు. నాలుగు రోజుల దావోస్ పర్యటనలో భాగంగా ప్రముఖ పారిశ్రామిక వేత్తలను కలిసిన సీఎం బృందం.. తెలంగాణ పెట్టుబడులు పెట్టాలని ఆకర్షించారు. అంతేగాక ఈ సదస్సులో అంతర్జాతీయ పారిశ్రామిక వేత్తలతో విస్తృతంగా చర్చలు జరిపి, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అనుకూల అవకాశాల గురించి, పారిశ్రామిక వేత్తలను ఆకర్షించేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీల గురించి వివరించారు.
అంతర్జాతీయ దిగ్గజ సంస్థలతో భేటీ అయ్యి పెట్టుబడులకు సంబంధించి కీలక ఒప్పందాలు చేసుకున్నారు. ఈ టూర్ లో దాదాపు 20 కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎంవోయూలు (MoUs) కుదుర్చుకున్నాయి. గత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మొత్తం 1.78 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకొని రైజింగ్ తెలంగాణ బృందం రికార్డు సృష్టించింది. ఈ ఒప్పందాలతో రాష్ట్రంలోని యువతకు పెద్ద ఎత్తున అవకాశాలు రానున్నాయి. ఈ పర్యటన అనంతరం రాష్ట్రానికి తిరిగి వచ్చిన రైజింగ్ తెలంగాణ బృందానికి కాంగ్రెస్ శ్రేణులు (Congress Supporters) ఘన స్వాగతం (Grand Welcome) పలికారు. రాష్ట్రానికి భారీ స్థాయిలో పెట్టుబడులు తీసుకొచ్చిన రైజింగ్ తెలంగాణ బృందానికి కృతజ్ఞతలు తెలియజేశారు.






