- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆస్ట్రేలియాలో విక్టోరియా పార్లమెంట్‌ను సందర్శించిన మంత్రి శ్రీధర్ బాబు
తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నారు. పర్యటనలో భాగంగా ఆయన విక్టోరియా పార్లమెంట్‌ను సందర్శించారు. శ్రీధర్ బాబుకు లెజిస్టేటివ్ కౌన్సిల్ గవర్నమెంట్ విప్ లీ తార్లామిస్, పార్లమెంటరీ సెక్రటరీ షీనా వాట్ స్వాగతం పలికారు.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నారు. పర్యటనలో భాగంగా ఆయన విక్టోరియా పార్లమెంట్‌ను సందర్శించారు. శ్రీధర్ బాబుకు లెజిస్టేటివ్ కౌన్సిల్ గవర్నమెంట్ విప్ లీ తార్లామిస్, పార్లమెంటరీ సెక్రటరీ షీనా వాట్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా లెజిస్లేటివ్ ప్రొసీజర్స్, పార్లమెంటరీ గవర్నెన్స్, పబ్లిక్ అకౌంటబిలిటీ తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.
శాసనాల తయారీలో పౌరుల భాగస్వామ్యం పెరిగినప్పుడే పారదర్శకత, జవాబుదారీతనం పెరుగుతుందని శ్రీధర్ బాబు అన్నారు. తెలంగాణలో అమలవుతున్న ప్రోగ్రెసివ్ లెజిస్లేటివ్ ప్రాక్టీసెస్, గవర్నెన్స్ రిఫార్మ్స్, డిజిటల్ ఇనీషియేటివ్స్ ను వారికి వివరించారు. ట్రాన్స్‌పరెంట్, టెక్నాలజీ-ఎనేబుల్డ్, సిటిజన్-డ్రివెన్ గవర్నెన్స్ మోడల్స్ రూపకల్పనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఆ దిశగా చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని చెప్పారు.






