అందువల్లే రేవంత్ సీఎం అయ్యారు : మంత్రి సంచలన వ్యాఖ్యలు

by Muthe.Rajitha |   (  Updated:2025-07-12 14:26:15  IST  )

రేవంత్ రెడ్డి(CM Revanth Reddy )కి సీఎం పదవి రావడానికి కారణాలు ఇవే అంటూ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) సంచలన వ్యాఖ్యలు చేసారు.

అందువల్లే రేవంత్ సీఎం అయ్యారు : మంత్రి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్ : రేవంత్ రెడ్డి(CM Revanth Reddy )కి సీఎం పదవి రావడానికి కారణాలు ఇవే అంటూ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) సంచలన వ్యాఖ్యలు చేసారు. 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికలలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో పార్టీ 64 సీట్లతో ఘన విజయం సాధించిందని, సీఎం అభ్యర్థిగా రేవంత్ ను ప్రకటించినప్పుడు అన్నిరకాలుగా సహాయ సహకారాలు అందించాలని నిర్ణయించుకున్నామని పేర్కొన్నారు. సీఎం పదవిలోకి వచ్చాక రేవంత్ రెడ్డి దూరదృష్టి, తీసుకునే నిర్ణయాలు రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతున్నాయని తెలిపారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం గణనీయమైన పురోగతి సాధిస్తోందని, ముఖ్యంగా హైదరాబాద్‌ను గ్లోబల్ టెక్ హబ్‌గా మార్చేందుకు ఆయన చేస్తున్న కృషిని శ్రీధర్ బాబు ప్రశంసించారు.

డిజిటల్ తెలంగాణ మిషన్, రీజనల్ రింగ్ రోడ్ (RRR), హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్-II, మూసీ పునరుద్ధరణ ప్రాజెక్టు వంటి కీలక ప్రాజెక్టులను వేగవంతం చేయడంలో ఆయన నిబద్ధత ప్రశంసనీయం అన్నారు. అలాగే రేవంత్ నాయకత్వంలోని ప్రభుత్వం పారదర్శకత, సమానత్వం, ప్రజల సంక్షేమంపై దృష్టి సారించిందని తెలియజేశారు.

Next Story