- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Power Point: తప్పులు చేసి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఎందుకు? మంత్రి శ్రీధర్‌బాబు కౌంటర్
అసెంబ్లీలో కాళేశ్వరం అంశంపై బీఆర్ఎస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ గురించి శాసనసభ వ్యవహారాల ఇంఛార్జి, మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: (Assembly sessions) అసెంబ్లీలో కాళేశ్వరం అంశంపై బీఆర్ఎస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ (PowerPoint presentation) గురించి శాసనసభ వ్యవహారాల ఇంఛార్జి, మంత్రి శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) కౌంటర్ ఇచ్చారు. శనివారం మొదటి రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. సమావేశాలకు ముందు మంత్రి శ్రీధర్ బాబు అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project) నిర్మాణంలో తప్పులు చేసింది వాళ్ళు.. మళ్ళీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఎందుకు? అని బీఆర్ఎస్ నేతలను ప్రశ్నించారు. ఏమైనా ఒప్పులు చేస్తే అవకాశం ఉండేది.. సభలో ఎవరికైనా ఆర్డర్ ప్రకారం మాట్లాడడానికి అవకాశం ఇస్తామని ఆయన స్పష్టం చేశారు.
యూరియా కోసం కేంద్ర మంత్రులపై ఒత్తిడి తెచ్చాం: మంత్రి తుమ్మల
ఒక్క తెలంగాణలోనే విషయంలోనే కాదు.. దేశం మొత్తం (Urea) యూరియా కొరత ఉందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Tummala Nageswara Rao) చిట్ చాట్‌లో మాట్లాడారు. యూరియా కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రానికి లేఖ రాశారని గుర్తుకు చేశారు. కేంద్ర మంత్రులతో మాట్లాడి ఒత్తిడి తెచ్చారని, ఈ క్రమంలోనే యూరియా కొంతమేర సాధించినట్లు వెల్లడించారు.






