- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Sridhar Babu: ఏరోస్పేస్-డిఫెన్స్ హబ్ గా తెలంగాణ.. ఇటలీ పారిశ్రామికవేత్తలతో మంత్రి శ్రీధర్ బాబు
సచివాలయంలో ఇటలీ పారిశ్రామికవేత్తలతో మంత్రి శ్రీధర్ బాబు భేటీ అయ్యారు.

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: దేశంలోనే అతిపెద్ద ఏరోస్పేస్–డిఫెన్స్ హబ్‌గా (Aerospace, Defense Hub) తెలంగాణ దూసుకెళ్తోందని మంత్రి శ్రీధర్ బాబు (Sridhar Babu) అన్నారు. ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో తెలంగాణకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని, పెట్టుబడులకు తెలంగాణలో విస్తారమైన అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఇవాళ సచివాలయంలో ఇటలీ పారిశ్రామికవేత్తలతో (Italian Industrialists) మంత్రి శ్రీధర్ బాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న సానుకూల అవకాశాలను వారికి మంత్రి వివరించారు. ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. కాంపోనెంట్ తయారీ, సప్లై చైన్‌లో పెట్టుబడులను ఆహ్వానించారు. మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవర్‌హాల్(ఎంఆర్వో)లో అవకాశాలు ఉన్నాయని, అవియానిక్స్, రాడార్, సెన్సార్ సిస్టమ్స్‌లో పెట్టుబడులు పెట్టాలని పిలుపునిచ్చారు. న్యూ-స్పేస్, చిన్న ఉపగ్రహాల రంగంలో పెట్టుబడులకు తెలంగాణ సిద్ధంగా ఉందన్న మంత్రి.. అధునాతన పదార్థాలు, కంపోజిట్స్ తయారీలో కూడా పెట్టుబడులకు ఆహ్వానిస్తున్నా వివరించారు.






