- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
1,400 మందికి ఉద్యోగాలు.. మహిళలకు ప్రాధాన్యం: మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన
క్లీన్ ఎనర్జీలో తెలంగాణను దేశంలోని ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా నిలిపేలా ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో: క్లీన్ ఎనర్జీలో తెలంగాణను దేశంలోని ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా నిలిపేలా ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా నుంగనూరు మండలం నర్మెట్టలో జునో జౌల్ బయో ఫ్యూయల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో రూ.700 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్రాజెక్ట్‌కు ఆదివారం భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సర్క్యూలర్ ఎకానమీని ప్రోత్సహించడం ద్వారా అటు పారిశ్రామిక వృద్ధిని, ఇటు పర్యావరణ పరిరక్షణను సమన్వయం చేయాలన్నదే తమ లక్ష్యమని వివరించారు. ఇప్పటికీ మన దేశం సుమారు 90 శాతం ముడి చమురును, 60 శాతం ఎల్పీజీని విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటున్నదన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంధన అవసరాల కోసం ఇతర దేశాలపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలంటే క్లీన్ ఎనర్జీనే కీలకమన్నారు. అందుకు.. గ్రామాలు ఇంధన కేంద్రాలుగా మారాలని, ఆ దిశగా తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నదని చెప్పారు. పరిశ్రమలను కేవలం హైదరాబాద్‌కే పరిమితం చేయకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేలా గ్రామాలకు విస్తరిస్తున్నామన్నారు.
నర్మెట్టలో ప్రారంభించబోయే ఈ ప్రాజెక్ట్ ద్వారా ఇక్కడి రైతులు కేవలం అన్నదాతలుగానే కాకుండా, దేశానికి ఇంధనాన్ని అందించే ఉర్జదాతలుగా చరిత్ర సృష్టిస్తారన్నారు. మూడు దశల్లో క్లస్టర్ పద్ధతిలో నిర్మించబోయే 10 సీబీజీ ప్లాంట్లలో వరి గడ్డి, ఆవు పేడ, కోళ్ల వ్యర్థాలతో బయో ఫ్యూయల్ గ్యాస్ ఉత్పత్తి చేస్తారన్నారు. ఇక్కడ సుమారు 1,400 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుందని, ఇందులో 30 శాతం మంది మహిళలే ఉంటారన్నారు. క్లీన్ ఎనర్జీ రంగంలో తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంపీలు భువనేశ్వర్ ఖైతా, ప్రేమచంద్రన్, ఎమ్మెల్యే హరీశ్‌రావు, కేంద్ర మాజీ మంత్రి సంతోష్ బాగ్రోడియా, మాజీ ఎంపీలు వి.హనుమంతరావు, రాయపాటి సాంబశివరావు, జునో జౌల్ బయో ఫ్యూయల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈవో రాయపాటి నాగశరత్ తదితరులు పాల్గొన్నారు.






