Sridhar Babu: రేషన్‌కార్డు దారులకు మంత్రి శ్రీధర్ బాబు శుభవార్త

by Gantepaka Srikanth |

రేషన్ కార్డు(Ration Card) దారులకు మంత్రి శ్రీధర్ బాబు(Sridhar Babu) శుభవార్త చెప్పారు. ఆదివారం ఓ మీడియా ఛానల్ ప్రతినిధితో శ్రీధర్ బాబు మాట్లాడారు.

Sridhar Babu: రేషన్‌కార్డు దారులకు మంత్రి శ్రీధర్ బాబు శుభవార్త
X

దిశ, వెబ్‌డెస్క్: రేషన్ కార్డు(Ration Card) దారులకు మంత్రి శ్రీధర్ బాబు(Sridhar Babu) శుభవార్త చెప్పారు. ఆదివారం ఓ మీడియా ఛానల్ ప్రతినిధితో శ్రీధర్ బాబు మాట్లాడారు. రేషన్‌కార్డు దారులకు సన్నబియ్యం ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే అన్ని రంగాలను ఆదుకునే ప్రయత్నం చేశామని అన్నారు. బీఆర్ఎస్(BRS) నేతలు తెలంగాణను పదేళ్లు నిర్లక్ష్యం చేశారని విమర్శలు చేశారు. కేంద్రంలో బీజేపీ(BJP) 3వ సారి గెలిచినా తెలంగాణకు ఒరిగిందేమీ లేదని అన్నారు. ఫాక్స్‌కాన్ పెట్టుబడుల అంశంలో కేటీఆర్(KTR) విమర్శలన్నీ సత్యదూరమైనవని తెలిపారు. రియల్‌ ఎస్టేట్‌ రంగం(Real estate sector)లో హైదరాబాద్‌ ఇంకా టాప్‌లోనే ఉందని అన్నారు.

ఫ్రెండ్లీ పార్టీ బీజేపీ కోసమే మాపై కేటీఆర్ ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. ప్రతిపక్షాల ఆలోచనలో మార్పు రావాలని సూచించారు. హైడ్రా(Hydra)తో అందరూ భయపడాల్సిన అవసరం లేదని.. కేవలం అక్రమార్కులకే భయమని అన్నారు. పేదలు మురికి కూపాల్లోనే ఉండాలని బీఆర్ఎస్, బీజేపీ నేతల ప్లాన్ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అసలు మూసీ ప్రాజెక్టుకు, రాబర్ట్‌వాద్రాకు ఏంటి సంబంధం ఏంటని ప్రశ్నించారు. చిన్నాభిన్నమైన తెలంగాణ ఆర్థికవ్యవస్థను గాడినపెడుతున్నామని అన్నారు. 200 యూనిట్ల ఉచిత కరెంటు ఇస్తున్నాం, మహిళలకు ఏడాదిగా ఫ్రీ బస్‌ ప్రయాణం కల్పిస్తున్నాం, ప్రతీ గ్యారంటీని అమలుచేసేలా ముందుకెళ్తున్నాం, గత అప్పులకు 10 నెలల్లో రూ.50వేల కోట్ల వడ్డీ కట్టామని చెప్పారు.

Next Story