15 రోజులు అన్నారు.. ఒక్క రోజుకే పారిపోయారు? : మంత్రి శ్రీధర్ బాబు

by Muthe.Rajitha |

బీఆర్ఎస్ ఇరిగేషన్ మీద డిష్కషన్ లో ఎందుకు పాల్గొనడం లేదు?

15 రోజులు అన్నారు.. ఒక్క రోజుకే పారిపోయారు? :  మంత్రి శ్రీధర్ బాబు
X

దిశ, తెలంగాణ బ్యూరో : అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తున్నట్లుగా బీఆర్ఎస్ తీసుకున్న నిర్ణయంపై మంత్రి శ్రీధర్ బాబు హాట్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ కి బీజేపీ అంటే భయమని విమర్శించారు. శుక్రవారం అసెంబ్లీ లాబీల్లో మీడియాతో శ్రీధర్ బాబు చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నరేగా పథకంపై చర్చలో భాగంగా బీజేపీపై మాట్లాడాల్సి వస్తుందని బీఆర్ఎస్ సభ నుండి పారిపోయిందని ఆరోపించారు. సభ 15 రోజులు పెట్టాలని డిమాండ్ చేసినవారు... ఒక్క రోజుకే ఎందుకు పారిపోయారని శ్రీధర్ బాబు ప్రశ్నించారు. ఇరిగేషన్ పై డిస్కషన్ కు వాళ్ళే సిద్ధం అన్నారు.. ఇప్పుడు ఎందుకు పారిపోయారని ఆయన ప్రశ్నలు గుప్పించారు. అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నడుస్తాయని మీడియా ప్రతినిథులు అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ ఈనెల 5, 6, 7, 8వ తేది వరకు సభను నడుపుతాం...అవసరమైతే సభ నడిపే రోజులను కూడా పెంచుతామని శ్రీధర్ బాబు సమాధానం ఇచ్చారు.

Next Story