- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘అన్నం పెట్టిన చెయ్యికి సున్నం పెట్టడం కేసీఆర్ కుటుంబ నైజం’: జూబ్లీహిల్స్ ప్రచారంలో సీతక్క ఫైర్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక(Jubilee Hills By-Election)ల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నవీన్ యాదవ్(Naveen Yadav) తరపున మంత్రి సీతక్క(Minister Seethakka) ప్రచారం చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక(Jubilee Hills By-Election)ల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నవీన్ యాదవ్(Naveen Yadav) తరపున మంత్రి సీతక్క(Minister Seethakka) ప్రచారం చేశారు. శుక్రవారం బోరబండలో స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లో పాల్గొని సీతక్క ప్రసంగించారు. నవీన్ యాదవ్ గెలుపు జూబ్లీహిల్స్ అభివృద్ధికి మలుపు అవుతుందని అన్నారు. మూడు పర్యాయాలు బీఆర్ఎస్‌ను గెలిపించారు.. కనీసం మంచినీళ్లు లేవు, డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేదని విమర్శించారు. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నారు.. కాబట్టి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఎమ్మెల్యేగా గెలిస్తే జూబ్లీహిల్స్‌లో సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పారు. ఒక అవకాశం నవీన్ యాదవ్‌కు ఇవ్వాలని కోరారు. మీరు నవీన్ యాదవ్‌ను ఆశీర్వదిస్తే అభివృద్ధి సంక్షేమ పథకాలు మీ ఇంటికే వస్తాయని అన్నారు. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందిస్తోందని చెప్పారు. ఇండ్లు లేని నాలుగున్నర లక్షల మంది పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసినట్లు తెలిపారు.
పేదలకు పక్కా ఇండ్లు కట్టి ఇస్తున్నాం.. రేషన్ కార్డులు ఇస్తున్నాం.. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం.. రూ. 500లకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం.. ఇలా అనేక హామీలు విజయవంతంగా అమలు చేస్తున్నామని అన్నారు. ప్రతి ఒక్కరు చేతి గుర్తుకు ఓటు వేసి నవీన్ యాదవ్‌ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఒక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే రూ.150 కోట్లతో అభివృద్ధి పనులు చేస్తున్నామని అన్నారు. పేదలకు సంక్షేమం ఉండాలంటే అది కాంగ్రెస్‌తోనే సాధ్యమని చెప్పారు. కన్నీళ్లు కావాలంటే బీఆర్ఎస్‌కు ఓటేయండి.. అభివృద్ధి, ఇల్లు కావాలంటే కాంగ్రెస్‌కు ఓటేయండి అని పిలుపునిచ్చారు.
నవీన్ యాదవ్ మీద బీఆర్ఎస్ నేతలు కేసీఆర్(KCR), కేటీఆర్, హరీష్ రావు తప్పుడు కూతలు కూస్తున్నారని సీరియస్ అయ్యారు. నవీన్ యాదవ్ తండ్రి శ్రీశైలం యాదవ్ ప్రచార రథం ఇస్తేనే కేసీఆర్ పార్టీ పెట్టారు. తొలి నాళ్లలో బీఆర్ఎస్ ప్రచారానికి నవీన్ యాదవ్ కుటుంబ డబ్బులు వాడుకున్నారు. ఇప్పుడు నవీన్ యాదవ్‌పై తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. అన్నం పెట్టిన చెయ్యికి సున్నం పెట్టడం కేసీఆర్ కుటుంబ నైజం.. నాడు చిన్న శ్రీశైలం యాదవ్ కుటుంబాన్ని వాడుకొని ఇప్పుడు విమర్శలు చేస్తే ప్రజలు క్షమించరు.. బీఆర్ఎస్ పార్టీలో రౌడీ షీటర్లు చేరారు.. బాలికలను వేధించిన, చిన్న పిల్లలను ఇబ్బంది పెట్టిన వ్యక్తులను బీఆర్ఎస్ లో చేర్చుకున్నారు.. రౌడీ షీటర్లకు స్వయంగా కేటీఆర్ దండేసి దండం పెట్టి కాళ్ళు మొక్కుతున్నారు.. కానీ ఒకప్పుడు కేసీఆర్‌కు అండగా నిలిచి ఆర్థిక సహాయం ఆదరించిన చిన్న శ్రీశైలం యాదవ్ కుటుంబంపై తప్పుడు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. సొంత కూతురు కవితనే వేధించి కేటీఆర్ బయటకి పంపారు. సొంత ఆడబిడ్డ కవితనే ఓర్వలేని కేటీఆర్ ఇతర ఆడబిడ్డలను సహిస్తారా? అని అడిగారు. ఈ గల్లీలో పుట్టి పెరిగిన నవీన్ యాదవ్‌ను గెలిపించండి అని సీతక్క కోరారు.






